రాజ్యాంగం ద్వారానే జీఓలు, హక్కులు దక్కాయ్: ప్రొ. కోదండరాం

రాజ్యాంగం ద్వారానే జీఓలు, హక్కులు దక్కాయ్: ప్రొ. కోదండరాం

ముషీరాబాద్, వెలుగు: రాజ్యాంగం ద్వారానే హక్కులు, జీఓలు దక్కాయని ప్రొఫెసర్ కోదండరాం చెప్పారు. రాజ్యాంగం లేకుంటే బాగుండు అనుకునే నేతలు, వ్యక్తులు ఉన్నారని, అదే లేకుంటే ఇష్టానుసారంగా అధికారం చెలాయించొచ్చు అనేది ధోరణి పెరిగిపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎస్సీ, ఎస్టీ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ డైరీ, క్యాలెండర్​ను ఆధ్వర్యంలో శనివారం బాగ్ లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆవిష్కరించారు. 

కోదండరాం, ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య, ఎస్సీ ఎస్టీ కమిషన్ మెంబర్ లక్ష్మీనారాయణ, మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్ హాజరయ్యారు. కోదండరాం మాట్లాడుతూ.. విద్యుత్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని, తన మద్దతు ఎప్పుడూ ఉంటుందని చెప్పారు. అసోసియేషన్ ప్రతినిధులు మాతంగి శ్రీనివాస్, దానయ్య, వరప్రసాద్, రాజనర్సు, రాములు తదితరులు పాల్గొన్నారు.