శివాజీ అడుగుజాడల్లో నడవాలి : రాజసింగ్

శివాజీ అడుగుజాడల్లో నడవాలి : రాజసింగ్

కొత్తకోట, వెలుగు: ప్రతి ఒక్కరూ ఛత్రపతి శివాజీ అడుగుజాడల్లో నడవాలని గోషామహల్​ ఎమ్మెల్యే రాజసింగ్  పిలుపునిచ్చారు. కొత్తకోట పట్టణంలోని బైపాస్  రోడ్​ సమీపంలో హిందు వాహిని ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 24 అడుగుల శివాజీ విగ్రహాన్ని శుక్రవారం ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఔరంగజేబు అక్రమాలను అరికట్టిన ఘనత శివాజీకి దక్కుతుందన్నారు. హిందూ సమాజం కోసం పుట్టిన ఛత్రపతి శివాజీ ఆశయాల కోసం పాటుపడాలని పిలుపునిచ్చారు. ప్రతిచోట అక్కాచెల్లెళ్లను అల్లరి చేసే వారు కనిపిస్తారని, వారి అంతు చూడాలని సూచించారు. హిందు వాహిని కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.