
యాదగిరిగుట్ట: రానున్న మున్సిపాలిటీ ఎన్నికల్లో ప్రజలంతా బీజేపీకి ఓటు వేయాలన్నారు గోశామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్. గురువారం యాదాద్రి భువనగిరి జిల్లాలో పర్యటించిన ఆయన.. బీజేపీకి ఓటు వేస్తే అభివృద్ధి జరుగుతుందన్నారు. రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలను ముఖ్యమంత్రి కేసీఆర్ నెరవేర్చలేదని, అందుకే కేసీఆర్ కు తెలంగాణ సమాజాన్ని ఓటు అడిగే హక్కు లేదని అన్నారు రాజాసింగ్. రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నిధులు లేవని, ఆ పార్టీకి ఓటు వేసినా.. అభివృద్ధి శూన్యమని చెప్పారు. బీజేపీ అంటే కేసీఆర్ కు భయమని, అందుకే యాదగిరిగుట్టలో బీజేపీ బైక్ ర్యాలీకి అనుమతివ్వలేదని చెప్పారు. ఒక్కసారి బీజేపీకి అవకాశం ఇచ్చి చూడాలని, అభివృద్ధి చేసి చూపెడతామని ఓటర్లకు తెలిపారు ఎమ్మెల్యే రాజాసింగ్.