
- సెంట్రల్ టూరిజం డిపార్ట్ మెంట్ ఆధ్వర్యంలో వెడ్డింగ్ డెస్టినేషన్స్
- ప్రాజెక్టులు, డ్యామ్ ల పరిసరాల్లో ఏర్పాటుకు అధికారుల ప్లాన్
- ఐదు నుంచి పదెకరాల స్థలం అవసరమని ప్రపోజల్స్
- ఫీజుబిలిటీ రిపోర్ట్ కోరిన సెంట్రల్ టూరిజం డిపార్ట్ మెంట్
- ఎల్లంపల్లి ప్రాజెక్ట్ వద్ద భూములు అనుకూలమంటున్న అధికారులు
మంచిర్యాల, వెలుగు: ప్రస్తుత కాలంలో మ్యారేజీ సెలబ్రేషన్స్ లైఫ్ లో గుర్తుండిపోయేలా సమ్ థింగ్ స్పెషల్ గా చేసుకునేందుకు ఇంట్రెస్ట్ చూపుతుంటారు. అయితే.. వెడ్డింగ్ డెస్టినేషన్స్ సిటీల్లో తప్ప టౌన్లలో అందుబాటులోకి రాలేదు. ఇక దేశవ్యాప్తంగా పలుప్రాంతాల్లో వెడ్డింగ్ డెస్టినేషన్స్ ఏర్పాటుకు సెంట్రల్ టూరిజం డిపార్ట్ మెంట్ నిర్ణయించింది.
‘ప్రమోటింగ్ ఎంటర్ ప్రెన్యూర్ షిప్, ఎంప్లాయ్ మెంట్ అండ్ స్కిల్లింగ్’ పేరిట వెడ్డింగ్ టూరిజం ప్రమోట్ చేయనుంది. ముఖ్యంగా ఇరిగేషన్ ప్రాజెక్టులు, డ్యామ్ ల పరిసర ప్రాంతాల్లో వీటిని డెవలప్ చేయాలని ప్లాన్ చేస్తోంది. వీటి ద్వారా యువతకు ఎంప్లాయ్ మెంట్ కల్పించడంతో పాటు టూరిజం డిపార్ట్ మెంట్ కు మరింత ఆదాయాన్ని రాబట్టాలని టార్గెట్ గా పెట్టుకుంది.
అనుకూలంగా ఎల్లంపల్లి ప్రాజెక్టు
మంచిర్యాల జిల్లా కేంద్రానికి 8 కిలోమీటర్ల దూరంలో గోదావరి నదిపై ఎల్లంపల్లి ప్రాజెక్టు ఉంది. 20 టీఎంసీల కెపాసిటీ కలిగిన ప్రాజెక్టులో ఏడాది పాటు నీరు నిల్వ ఉంటుంది. ప్రాజెక్టు దిగువన ఇరిగేషన్ డిపార్ట్ మెంట్ భూములు ఉన్నాయి. ఇక్కడ కొంత భూమిని ఇంటర్నేషనల్ ఫిష్ పాండ్ కోసం కేటాయించారు. మిగతా స్థలం వెడ్డింగ్ డెస్టినేషన్ కు అనుకూలంగా ఉంటుందని అధికారులు భావిస్తున్నారు.
ఎల్లంపల్లి ప్రాజెక్టు దిగువన ఇరిగేషన్ భూములు అందుబాటులో ఉండడంతో అక్కడే వెడ్డింగ్ డెస్టినేషన్, హరిత రిసార్ట్స్ ఏర్పాటు చేయవచ్చు. తద్వారా జిల్లాలో టూరిజం డెవలప్ చేయడానికి అవకాశాలు ఉన్నాయి. ప్రజా ప్రతినిధులు, జిల్లా అధికారులు ఈ దిశగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే.. బీఆర్ఎస్ హయాంలో మంచిర్యాల ఐబీ స్థలాన్ని హరిత రిసార్ట్స్ కోసం కేటాయించారు. అందులో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మించారు. అనంతరం దాన్ని కూల్చేసి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ఎంసీహెచ్ నిర్మిస్తున్నారు.
ఐదు నుంచి పది ఎకరాల్లో ఏర్పాటు
దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో అనువైన ప్రాంతాల కోసం అన్వేషణ మొదలుపెట్టింది. ఐదు నుంచి పదెకరాల విస్తీర్ణంలో వెడ్డింగ్ డెస్టినేషన్స్ ఏర్పాటుకు డ్యామ్ ల పరిసర ప్రాంతాల్లో వీటిని డెవలప్ చేయాలని టూరిజం డిపార్ట్ మెంట్ ప్లాన్ చేసింది. మోడ్రన్ లుక్ తో మ్యారేజ్ ఫంక్షన్ లైఫ్ లో స్వీట్ మెమొరీగా నిలిచిపో యేలా వీటిని తీర్చిదిద్దనుంది. ఇందుకు ఏయే ప్రాంతాలు వెడ్డింగ్ డెస్టినేషన్స్ ఏర్పాటుకు అనువుగా ఉన్నాయో ఫీజుబిలిటీ రిపోర్ట్ పంపాలని రాష్ట్ర టూరిజం అధికారులను ఆదేశించింది.