
నిజామాబాద్, వెలుగు : గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై బీజేపీ పార్టీ సస్పెన్షన్ ఎత్తివేసిన నేపథ్యంలో ఆయన అభిమానులు మంగళవారం నిజమాబాద్‌లో సంబరాలు చేసుకున్నారు. నాందేవ్‌వాడలోని శివాజీ చౌరస్తాలో రాజాసింగ్ ఫొటోకు పాలాభిషేకం చేశారు. హిందూధర్మానికి అంకితమైన ఆయన మరోసారి భారీ మెజారిటీతో గెలువాలని కోరుకుంటూ నినాదాలు చేశారు.