గొటాబాయకు ఆ హక్కు ఉంది

గొటాబాయకు ఆ హక్కు ఉంది

ప్రజా నిరసనలతో థాయ్ లాండ్ పరారైన శ్రీలంక మాజీ అధ్యక్షుడు గొటాబాయ రాజపక్స త్వరలోనే స్వదేశానికి వెళ్లనున్నారు. క్షేమంగా తిరిగి వచ్చేందుకు, వచ్చిన తర్వాత భద్రత కల్పించేందుకు శ్రీలంక అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే హామీ ఇచ్చినట్లు సమాచారం. గొటాబాయ, ఆయన భార్య లోమా రాజపక్స ప్రస్తుతం బ్యాంకాక్ లోని ఓ హోటల్ లో ఉంటున్నారు. భద్రత కారణాలతో హోటల్ నుంచి బయటకు రావద్దని అధికారులు ఆదేశించారు. తాను ఆశించిన విధంగా థాయ్ ప్రభుత్వం స్వేచ్ఛ ఇవ్వకపోవడంతో స్వదేశానికి వచ్చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. కానీ గొటాబాయ శ్రీలంకకు వచ్చే తేదీ ఇంకా ఖరారు కాలేదని అధికారులు అన్నారు.

గొటాబాయ శ్రీలంకకు తిరిగివచ్చే హక్కు ఉందని ప్రధాన ప్రతిపక్ష పార్టీ సమాగి జన బలవేగయ తెలిపింది. అయితే నిధుల దుర్వినియోగం ఆరోపణలపై గొటాబాయ విచారణ ఎదుర్కోవల్సిందేనని స్పష్టం చేసింది. ప్రస్తుతం ఆయనకు చట్టపరమైన మినహాయింపులు లేవంది. ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు భారత్ అందించిన బిలియన్ డాలర్ల రుణాన్ని రాజపక్స ప్రభుత్వం దుర్వినియోగం చేసిందని ఎస్జేబీ ఆరోపించింది.