ఫ్లోర్ టెస్ట్ కు ఆదేశాలు ఇచ్చే అధికారం ఉంది

ఫ్లోర్ టెస్ట్ కు ఆదేశాలు ఇచ్చే అధికారం ఉంది

న్యూఢిల్లీ : మధ్య ప్రదేశ్ గవర్నర్ చర్యను సుప్రీంకోర్టు సమర్థించింది. ప్రభుత్వాన్ని మెజారిటీ నిరూపించుకోవాలని ఆదేశించే అధికారం గవర్నర్ కు ఉంటుందని తెలిపింది. గత నెలలో కమల్ నాథ్ సర్కార్ ను మెజార్టీ నిరూపించుకోవాలని గవర్నర్ లాల్జీ టాండన్ ఆదేశించారు. దీనిపై అప్పటి సీఎం కమల్ నాథ్ సుప్రీంను ఆశ్రయించారు. ఈ కేసులో జస్టిస్ డీ.వై. చంద్రచూడ్, హేమంత్ గుప్తా నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం తీర్పు ఇచ్చింది. అసెంబ్లీ సమావేశాలు నిర్వహించమని చెప్పే అధికారం మాత్రమే గవర్నర్ ఉంది కానీ బల నిరూపణ చేసుకోవాలని ఆదేశించి హక్కు గవర్నర్ కు లేదంటూ కమల్ నాథ్ సర్కార్ పిటిషన్ లో పేర్కొంది. దీనిపై సుప్రీం 1994 లో ఎస్.ఆర్. బొమ్మై కేసును రిఫర్ చేస్తూ బల నిరూపణకు ప్రభుత్వాన్ని ఆదేశించే హక్కు గవర్నర్‌కు ఉంటుందని స్పష్టం చేసింది. మెజార్టీ లేని కారణంగా బల నిరూపణకు ముందే కమల్ నాథ్ సీఎం పదవికి రిజైన్ చేశారు.