ఆలయాభివృద్ధికి కృషి చేయడం సంతోషం : షబ్బీర్​అలీ

ఆలయాభివృద్ధికి కృషి చేయడం సంతోషం :  షబ్బీర్​అలీ

భిక్కనూరు, వెలుగు: ఆలయాభివృద్ధికి కృషి చేయడం సంతోషంగా ఉందని ప్రభుత్వ సలహాదారుడు షబ్బీర్​అలీ అన్నారు. గురువారం మండల కేంద్రంలోని స్థానిక శ్రీపార్వతీ సిద్ధరామేశ్వర ఆలయంలో వాస్తు హోమానికి ఆయన ముఖ్యఅతిథిగా హజరై మాట్లాడారు. కామారెడ్డి జిల్లాలోనే ఎంతో ప్రాచీన చరిత్ర కలిగిన శ్రీసిద్ధరామేశ్వర మహాక్షేత్రం అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

 9 రోజుల పాటు సాగే  కార్యక్రమంలో భాగంగా మూడోరోజు అర్చకులు వేదపారాయణం నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయభివృద్ది కమిటీ చైర్మెన్​అందె మహేందర్​రెడ్డి,ఈవో శ్రీధర్, ఎంపీపీ గాల్​రెడ్డి, మాజీ సర్పంచులు తునికి వేణు, నరసింహారెడ్డి, మహిపాల్​రెడ్డి, అందె దయాకర్​ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.​​​​​​

మాచారెడ్డి: మాచారెడ్డి మండలం చుక్కాపూర్​శ్రీలక్ష్మీనర్సింహ్మాస్వామి కల్యాణం గురువారం ఘనంగా జరిగింది. ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం స్వామివారి కల్యాణాన్ని అర్చకులు వేద మంత్రోచ్చరణల మధ్య నిర్వహించారు. ఈ వేడుకలకు ప్రభుత్వ సలహాదారు షబ్బీర్​అలీ హాజరయ్యారు. ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని స్వామివారిని వేడుకున్నట్లు తెలిపారు.