తప్పులు ఉంటే సరిచేసుకోండి..ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు సర్కార్ అవకాశం

తప్పులు ఉంటే సరిచేసుకోండి..ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు సర్కార్ అవకాశం

హైదరాబాద్, వెలుగు: ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ఇచ్చిన ఆధార్ కార్డ్‌‌‌‌లో తప్పులు ఉంటే సరిచేసుకొని మళ్లీ సబ్మిట్ చేసేందుకు ప్రభుత్వం అవకాశం ఇచ్చింది. ఈ మేరకు కలెక్టర్లకు హౌసింగ్ సెక్రటరీ, కార్పొరేషన్ ఎండీ వీపీ గౌతమ్ సర్క్యులర్ జారీ చేశారు. లబ్ధిదారులు ఇచ్చిన అకౌంట్ నంబర్ కు, ఆధార్ లింక్ లేకపోవటం, 2 కార్డుల్లో ఉన్న వివరాలు మ్యాచ్ గాకపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా 30% మంది లబ్ధిదారులు (9వేల మంది) పేమెంట్లు ఆగినట్లు అధికారులు గుర్తించారు.

రానున్న రోజుల్లో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు డీబీటీ (డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ ఫర్)లో భాగంగా ఎన్ పీసీఐ (నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా)లో ఏపీబీఎస్ (ఆధార్ పేమెంట్ బ్రిడ్జి సిస్టం) ద్వారా చెల్లింపులు చేస్తామని సెక్రటరీ స్పష్టం చేశారు. జిల్లాల్లో ఆధార్ తప్పులు ఉన్న కేసులను గుర్తించి పరిష్కరించాలని, పేర్లు, ఆధార్ నంబర్స్ అప్ డేట్ చేయాలని, ఆధార్ హెల్ప్ లైన్ నంబర్లు, సిబ్బంది సేవలను ఉపయోగించుకోవాలని కలెక్టర్లకు సెక్రటరీ సూచించారు.

ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లలో పేర్ల మార్పులకు 2 రోజుల పాటు అవకాశం ఇచ్చామని సెక్రటరీ వెల్లడించారు. ఈ పక్రియ పూర్తయ్యాక పంచాయతీ సెక్రటరీ, వార్డ్ ఆఫీసర్ లాగిన్ లో కొత్త వివరాలు కనిపిస్తామని, ఆ తర్వాత పేమెంట్ ఈజీగా అవుతుందన్నారు.