డిపాజిట్ల రూపంలో డబ్బులు తీసుకొని పెద్ద మొత్తంలో వడ్డీలకు ఇస్తామని నమ్మబలికి ఓ గవర్నమెంట్ బ్యాంక్ అధికారి భారీ మోసానికి పాల్పడింది. యామమాటలు చెప్పి బ్యాంక్ జనరల్ మేనేజర్ రూ.200 కోట్లు వసూలు చేసింది. శ్రీ ప్రియాంక ఎంటర్ ప్రైజెస్ పేరుతో అబిడ్స్ లోని తెలంగాణ స్టేట్ కోఆపారేటివ్ బ్యాంక్ జనరల్ మేనేజర్ గా పనిచేస్తున్న నిమ్మగడ్డ వాణి బాల సుమారు 517 మంది నుంచి రూ.200 కోట్ల వరకు వసూలు చేసింది. ఆమె భర్త మేక నేతాజీ, కొడుకు మేక శ్రీహర్షలు డిపాజిట్ల సేకరణ చేశారు. ఆ డబ్బులు తీసుకొని పరార్ అయ్యారు. వాణి బాలని సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
టెస్కాబ్ బ్యాంక్ కు వచ్చి డిపాజిట్ చేయాలనుకున్న వినియోగదారులను ఆకర్షించి పెట్టుబడి పెట్టేలా చేసింది. బ్యాంక్ సమీపంలో తన భర్తతో మరో ఆఫీస్ ఓపెన్ చేయించి డిపాజిట్లు చేయించింది నిమ్మగడ్డ వాణి బాల. అపెక్స్ బ్యాంక్ జనరల్ మేనేజర్ నిమ్మగడ్డ వాణి బాల ఈ కేసులో అసలు సూత్రధారి. ఇక తమకు న్యాయం చేయాలని బషీర్ బాగ్ లోని హైదరాబాద్ సీసీస్ పోలీసులను ఆశ్రయించారు బాధితులు. వాణి బాల చిట్ ఫండ్ కంపెనీ శ్రీ ప్రియాంక ఎంటర్ ప్రైజెస్ పైన సిసిఎస్ పోలీసులు కేసు నమోదు చేశారు.
