సర్కారు నిర్ణయం: ఐదో విడత హరితహారంలో చింత మొక్కలు

సర్కారు నిర్ణయం: ఐదో విడత హరితహారంలో చింత మొక్కలు

జూలైలో ఐదో విడత హరితహారానికి రెడీ అవుతోంది ప్రభుత్వం.ఈసారి పెద్ద సంఖ్యలో చింత మొక్కలను నాటాలని అధికారులను ఆదేశించారు సీఎం కేసీఆర్.దీంతో ప్రతి జిల్లా కేంద్రంలో  15 నుంచి 20 కిలో మీటర్ల వరకు చింత మొక్కలను నాటేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. నర్సరీల్లో చింత చెట్ల మొక్కలను ఎక్కువగా పెంచుతున్నారు.

తొలి విడతలో ప్రతి జిల్లాలో రోడ్లకు రెండువైపులా చింత మొక్కలను నాటనున్నారు. చింతతో పాటు గంధం, వెదురు, టేకు, సరుగుడు మొక్కల పెంపకం చేపట్టనున్నారు అధికారులు. నర్సరీలను గ్రామం పేరుతో కలిపి హరితహారం నర్సరీలుగా పిలవాలని నిర్ణయించింది ప్రభుత్వం. ఏ శాఖ నర్సరీని నిర్వహిస్తున్నా గ్రామ పంచాయితీ పేరుపైనే ఉండాలని ఆదేశించింది.  పట్టణ ప్రాంతాల్లోని నర్సరీలకు ఇదే విధంగా పేరు పెట్టాలని కింది స్థాయి పారెస్ట్ ,పంచాయతి రాజ్ అధికారులకు సూచించింది ప్రభుత్వం.