యాదాద్రిని తప్ప ఆలయాలను పట్టించుకోని ప్రభుత్వం

V6 Velugu Posted on Mar 22, 2021

ఎములాడ రాజన్న.. కొండగట్టు అంజన్న.. భద్రాద్రి రామయ్య.. అలంపూర్ జోగులాంబ.. బాసర సరస్వతి.. ఇట్ల చెప్పుకుంటూ పోతే ఎన్నో ప్రధాన ఆలయాలకు రాష్ట్ర సర్కారు ఇచ్చిన హామీలన్నీ అటకెక్కాయి. కొట్లాడి తెచ్చుకున్న రాష్ట్రంలో గుళ్లను మస్తు డెవలప్ చేస్తామని, సుందరంగా తీర్చిదిద్దుతామని సీఎం కేసీఆర్ చెప్పిన మాటలన్నీ నీటిమూటలయ్యాయి. ట్యాంక్బండ్లు, రోప్వేలు, విశాలమైన రోడ్లు, కల్యాణమండపాలు, కల్యాణకట్టలు, కాటేజీలు.. ఇట్ల ఎన్నో ఏర్పాటు చేస్తామని చెప్పి పక్కనపడేశారు. యాదాద్రి నర్సన్న గుడికి తప్ప ఏ ఒక్క గుడికీ రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇవ్వడం లేదు. పైగా ఆయా దేవస్థానాల ద్వారా వచ్చే ఆదాయాన్ని తన ఖజానాకు మళ్లించుకుంటోంది. ఆలయాల్లో సరైన సౌలతులు లేక భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.  

సీఎంగా కేసీఆర్ బాధ్యతలు స్వీకరించిన కొత్తలోనే యాదాద్రి లక్ష్మీనర్సింహస్వామి ఆలయాన్ని తిరిగి కట్టాలని నిర్ణయించారు. 2016లో ‘యాదాద్రి టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ’ ఏర్పాటు చేసి రూ. 1,200 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. ఈ ఫండ్స్తో టెంపుల్ రీ కన్స్ట్రక్షన్తో పాటు టెంపుల్ సిటీ డెవలప్మెంట్ పనులు దాదాపు పూర్తి కాగా త్వరలోనే ప్రారంభించేందుకు  ఏర్పాట్లు చేస్తున్నారు. కానీ యాదాద్రితో పాటే ఫండ్స్ ఇస్తామని, డెవలప్ చేస్తామని అదే కేసీఆర్ నుంచి హామీలు పొందిన ఇతర ప్రధాన ఆలయాల పరిస్థితి మరోలా ఉంది. వేములవాడకు ఏడాదికి రూ. 100 కోట్ల లెక్క నాలుగేండ్ల పాటు నిధులిస్తామని ఆరేండ్ల కింద సీఎం ఇచ్చిన హామీ జాడలేకుండా పోయింది. భద్రాద్రి రామాలయానికి నాలుగేండ్ల కింద ఇస్తామన్న రూ. 100 కోట్లు పత్తా లేవ్. కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయ అభివృద్ధికి మూడేండ్ల కింద మాస్టర్ ప్లాన్ రెడీ చేసినా మూలకుపడింది.

వేరే ఆలయాలదీ ఇదే పరిస్థితి.
దక్షిణ భారత దేశంలోనే అతి పెద్ద హనుమాన్ టెంపుల్ గా గుర్తింపు పొంది ఏటా రూ. 15 కోట్ల ఆదాయం తెచ్చే కొండగట్టు అభివృద్ధికి రాష్ట్ర సర్కారు గత ఆరేండ్లలో ఇచ్చింది సున్నా. సర్కారు ఆదేశాలతో కొండగట్టు అంజన్న ఆలయ అభివృద్ధికి మూడేండ్ల కిందే మాస్టర్ ప్లాన్ రెడీ చేశారు. కలెక్టర్ శరత్ ఆలయానికి 2018లో 333.3 ఎకరాల రెవెన్యూ భూములను సర్వే చేసి కేటాయించారు. కానీ మాస్టర్ ప్లాన్ నేటికీ కాగితాలను దాటలేదు. వాస్తవానికి మాస్టర్ ప్లాన్కు ముందే కొండగట్టును పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు 2014లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం గుట్టపైకి రోప్ వే నిర్మాణం కోసం  ప్రపోజల్స్ రెడీ చేసింది. కానీ ఫండ్స్ లేక పనులు మొదలవలేదు. మెట్ల దారిని కొత్త హంగులతో తీర్చి దిద్దడానికి రూ. 2.5 కోట్ల అంచనాతో టెండర్లు పిలిచి కాంట్రాక్టు అప్పగించినా ఈనాటికీ పనులు మొదలవలేదు. టెంపుల్ ఆఫీస్ కోసం వై జంక్షన్ వద్ద రూ. 2 కోట్లతో మూడంతస్తుల భవనం కట్టి మూడేండ్లవుతున్నా నేటికీ ప్రారంభించలేదు. భక్తుల కోసం కట్టిన గెస్ట్ హౌజ్ లోనే ఆఫీస్ నడుపుతున్నారు. అద్దె గదులు లేక భక్తులు చెట్ల కిందే సేదదీరుతున్నారు. కొండగట్టుకు వచ్చే హనుమాన్ దీక్షా పరులకు మాల విరమణ చేయడానికి ఇప్పటివరకు మండపం కట్టలేదు. కల్యాణకట్టలోనే  మాల విరమణ చేయాల్సి వస్తోంది. 2018 సెప్టెంబర్ 12న  కొండగట్టు ఘాట్ రోడ్డుపై ఘోరప్రమాదం జరిగి 65 మందికి పైగా మృతి చెందారు. మూలమలుపుల వల్లే యాక్సిడెంట్లు జరుగుతున్నాయని తేల్చిన అధికారులు రోడ్డుపై వెహికల్స్  రాకపోకలు నిషేధించారు. కొత్త ఘాట్ రోడ్డు కట్టాకే  అనుమతిస్తామన్నారు. మూడేండ్లు గడిచినా  రోడ్డు లేక భక్తులు 10 కిలోమీటర్లు చుట్టూ తిరిగి వెళ్తున్నారు.

 
రాజన్నకు నిధులేమాయె?
సీఎం హోదాలో కేసీఆర్ 2015  జూన్ 18 న ఎములాడ రాజన్నను దర్శించుకున్నప్పుడు పలు అభివృద్ధి పనుల కోసం వెంటనే రూ. 50 కోట్లు,  ఏటా బడ్జెట్లో రూ. 100 కోట్ల చొప్పున నాలుగేండ్లపాటు రూ. 400 కోట్లు ఇస్తామన్నరు. ఈ హామీలిచ్చి ఆరేండ్లవుతున్నా ఇప్పటిదాకా ఇచ్చింది కేవలం రూ. 71 కోట్లే. మిగతా నిధుల ముచ్చట్నే లేదు. గుడి చెరువును ట్యాంక్ బండ్లెక్క చేస్తమన్నరు..  కాటేజీలు కడ్తమన్నరు.. ఘాట్ రోడ్డు నిర్మిస్తమన్నరు.. ప్లానిటోరియం అన్నరు..  పనోరమ వ్యూ,  రోప్ వే అన్నరు.. అవన్నీ కాగితాలకే పరిమితమైనయ్. సీఎం హోదాలో కేసీఆర్ 2015  జూన్ 18 న వేములవాడ రాజన్నను దర్శించుకున్నారు. ఆలయానికి వచ్చే రోడ్లను విస్తరించాలని, ఆలయం చుట్టూ 1,000 మీటర్ల పరిధిలో బహుళ అంతస్తుల భవనాలను పడగొట్టించాలన్నారు.  వేములవాడ టెంపుల్ డెవలప్ మెంట్ అథారిటీ (వీటీడీఏ) ఏర్పాటుచేసి శృంగేరి పీఠాధిపతి సూచనలతో ఆలయ ప్రాంగణాన్ని విస్తరిస్తామని చెప్పారు. రాజన్న గుడి చెరువు కట్టను 150 ఫీట్ల వెడల్పుతో ట్యాంక్బండ్ గాడెవలప్ చేసి, చుట్టూ పార్కులు, చెరువులో బోటింగ్ ఏర్పాటుచేస్తామన్నారు. మూలవాగుపై రెండు బ్రిడ్జిలతో పాటు నాంపల్లి గుట్టను కూడా డెవలప్ చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఇందుకోసం వెంటనే రూ. 50 కోట్లు,  ఏటా బడ్జెట్లో రూ. 100 కోట్ల చొప్పున నాలుగేండ్లపాటు రూ. 400 కోట్లు కేటాయిస్తామని ప్రకటించారు. సీఎం హామీలిచ్చి ఆరేండ్లు గడిచిపోయాయి. కట్ చేస్తే.. సీఎం ఇస్తానన్న రూ. 450 కోట్లలో వచ్చింది ఇప్పటిదాకా రూ. 71.50 కోట్లు మాత్రమేనని ఆఫీసర్లు చెప్తున్నారు.  వాటితో మూలవాగు మీద వంతెన తప్ప ఇతరత్రా ఏ డెవలప్మెంట్  జరగలేదు. అదే టైంలో ఏటా రూ. 100 కోట్ల చొప్పున ఎములాడ రాజన్నకు వచ్చే ఆదాయాన్ని దేవాదాయశాఖ ద్వారా సర్కారు ఖజానాలో వేసుకుంది. 


గుడి చెరువు పూడ్చివేతతో కష్టాలు 


రాజన్న గుడి చెరువు169 ఎకరాలు ఉండగా మరో 35 ఎకరాల  ప్రైవేట్ స్థలాన్ని సేకరించి, లెవల్ చేసి వదిలేశారు. ఇందులో 35 ఎకరాల్లో శివ కల్యాణ మండపం, రామ కల్యాణ మండపం, కల్యాణ కట్ట, వేద, నృత్య పాఠశాల, మధ్యలో చెరువు, అందులో నటరాజ విగ్రహం, పక్కన అన్నదాన భవనం, ప్రసాదం కౌంటర్స్ ఏర్పాటు చేయాలనుకున్నప్పటికీ చేయలేదు.  చెరువు చుట్టూ ట్యాంక్ బండ్ జాడలేదు. సీఎం ఏదో చేస్తారని ఉన్న చెరువును పూడిస్తే గ్రౌండ్ వాటర్ తగ్గి టౌన్లో నీటి సమస్యలు తలెత్తాయి. ఇక ధర్మగుండాన్ని సరికొత్త హంగులతో తీర్చిదిద్దడం, భక్తుల వసతి కోసం కాటేజీలు, నాంపల్లి గుట్టపై ధ్యాన మందిరం, ఘాట్ రోడ్డు నిర్మాణం, ప్లానిటోరియం, పనోరమ వ్యూ,  రోప్ వే.. ఇలా అన్ని హామీలు కాగితాలకే పరిమితమయ్యాయి.  
ఇంకా ఎన్నెన్నో సమస్యలు
వేములవాడ రోడ్లన్నీ ఇరుగ్గా ఉన్నాయి. దీంతో భక్తులు తమ వాహనాలను ఎక్కడో ఊరవతల పార్క్ చేసి కిలోమీటరుకుపైగా కాలినడకన మూటాముల్లెతో, పిల్లపాపలతో రావాల్సి వస్తోంది. పట్టణంలో ఇప్పటికీ ఏ ఒక్కరోడ్డును కూడా విస్తరించలేదు. శివరాత్రి, శ్రీరామనవమి, సమ్మక్క జాతరలప్పుడు ఇసుకపోస్తే రాలనంత ట్రాఫిక్ఉంటోంది. 
ఇరుకైన క్యూలైన్లలో పిల్లలు, మహిళలు, వృద్ధులు గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తోంది. ఒక్కోసారి ఊపిరాడక సొమ్మసిల్లి పడిపోతున్నారు. ఒక్కసారి క్యూలైన్లో ప్రవేశించామంటే ఒంటికి, రెంటికి కూడా ఉగ్గబట్టుకోవాల్సిన దుస్థితి ఉంది. ఏదైనా అత్యవసర పరిస్థితి వస్తే భక్తులను బయటకు తీసుకువచ్చే పరిస్థితి కూడా లేదు. 
ఎములాడలో ప్రస్తుతం ఉన్న 550 వసతి గదులు ఏమూలకూ సరిపోతలేవు. అవి కూడా కూలడానికి సిద్ధంగా ఉన్నాయి. దీంతో గదులు దొరకక, ఆలయ ప్రాంగణంలో మెట్లపై సామాన్య భక్తులు నిద్రపోతున్నారు. ఇలాంటి సమయంలో దొంగలు నగలను, పిల్లలను కూడా ఎత్తుకెళ్తున్నారు. 
రామయ్యకు ఇచ్చిన మాటెటుపాయె?
‘‘భద్రాద్రిని సుందరంగా తీర్చిదిద్దుకుందాం. రూ. 100 కోట్లు కేటాయిస్తా.. మంచిగ డెవలప్ చేసుకుందాం..’’ 2016లో  సీఎం కేసీఆర్ ఇచ్చిన మాట ఇది. సీఎం ఆదేశాల మేరకు అప్పట్లో చినజీయర్స్వామి, ఆర్కిటెక్ట్ ఆనందసాయి సుందర భద్రాద్రి కోసం వివరాలు తీసుకుని మాస్టర్ప్లాన్ తయారు చేసి సీఎంకు అందజేసిన్రు. కానీ ఆ మాస్టర్ప్లాన్ సీఎం ఆఫీస్ నుంచి ఇప్పటి వరకు బయటకు రాలేదు. వంద కోట్ల ముచ్చట్నే లేదు. అప్పట్లో వారంలో మళ్లొస్తానన్న సీఎం.. నాలుగేండ్లు దాటుతున్నా  భద్రాద్రి దిక్కు చూడటం లేదు.
‘‘ఉమ్మడి రాష్ట్రంలో దక్షిణ అయోధ్య భద్రాచలం అభివృద్ధి చెందలేదు. శ్రీసీతారామచంద్రస్వామిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు కనీస సౌకర్యాల్లేవు. కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో ఇప్పుడు సుందర భద్రాద్రిగా తీర్చిదిద్దుకుందాం. రూ. 100 కోట్లు కేటాయిస్తా. మంచిగ డెవలప్ చేసుకుందాం’’.. 2016లో  సీఎం కేసీఆర్ ఇచ్చిన మాట ఇది. సీఎం ఆదేశాల మేరకు అప్పట్లో చినజీయర్స్వామి, ఆర్కిటెక్ట్ ఆనందసాయి సుందర భద్రాద్రి కోసం వివరాలు తీసుకుని మాస్టర్ ప్లాన్ తయారు చేసి సీఎంకు అందజేశారు. కానీ ఆ ప్లాన్ సీఎం ఆఫీస్ నుంచి ఇప్పటికీ బయటకు రాలేదు. వంద కోట్ల ముచ్చట్నే లేదు. వారంలో మళ్లొస్తానన్న సీఎం.. నాలుగేండ్లు దాటుతున్నా  భద్రాద్రి దిక్కు చూడటం లేదు. మన దక్షిణ అయోధ్య.. తెలంగాణ రాకముందు ఎట్లున్నదే ఇప్పుడూ అట్లనే ఉన్నది.
కేంద్రం నిధులు పాయె.. రాష్ట్రం ఇయ్యకపాయె
2016లోనే కేంద్ర టూరిజం శాఖ  రామాయణం సర్క్యూట్లో భద్రాచలం దేవస్థానాన్ని చేర్చి రూ. 30 కోట్లు ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం కనీసం డీపీఆర్ఇవ్వకుండా ఫండ్స్ వదులుకుంది. ఇప్పుడేమో అదే కేంద్రం తెచ్చిన ప్రసాద్ స్కీం కింద రూ. 50 కోట్లతో ప్రపోజల్స్ పంపేందుకు  రెడీ అవుతోంది.  కేసీఆర్ ఆదేశాల మేరకు నాలుగేండ్ల కింద చినజీయర్స్వామి, ఆర్కిటెక్ట్ ఆనందసాయి గీసిన మాస్టర్ప్లాన్ ప్రకారం.. భద్రాద్రిలో కంచెర్ల గోపన్న కట్టడాలకు ఎలాంటి భంగం కలగకుండా చుట్టూ ప్రాకారాలు కట్టాలి. మొదటి ప్రాకారాన్ని 20 అడుగులు, రెండో ప్రాకారాన్ని 50 అడుగుల ఎత్తులో నిర్మించాలని మాస్టర్ ప్లాన్లో పేర్కొన్నారు. ఎటు నుంచి చూసినా ఆలయం చూడచక్కగా కనిపించేలా శిల్ప కళాశోభితంగా నిర్మాణాలు ఉండాలని ప్రతిపాదించారు. రామయ్య కల్యాణం కోసం ప్రత్యేకంగా వెయ్యి కాళ్ల మండపాన్ని నిర్మించాలని అనుకున్నారు. 40 అడుగులు విస్తరించిన మాడవీధులు, గోదావరి వద్ద పుష్కరిణి, పర్ణశాలను డెవలప్ చేయాలని భావించారు.  ఇక 105 అడుగుల ఎత్తయిన శ్రీరామస్తూపాన్ని నిర్మించాలని డిజైన్లో పేర్కొన్నారు. ఇందుకోసం మిథిలా స్టేడియం చుట్టుపక్కల 65 ఎకరాలు సేకరించాలని నిర్ణయించారు. ఇప్పటికీ అడుగు భూమి కూడా సేకరించలేదు. 
ఎన్నో సమస్యలు
రామయ్యను దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు వసతి సదుపాయాలు అంతంతగానే ఉంటున్నాయి.  మొత్తం 23 కాటేజీల్లో 120 రూములే అందుబాటులో ఉన్నాయి. రోజూ వేలాదిగా వచ్చే భక్తులకు ఇవి సరిపోవట్లేదు. ముక్కోటి, శ్రీరామనవమి సమయాల్లో గోదావరి ఇసుక తిన్నెలే భక్తులకు దిక్కవుతున్నాయి.  
గతంలో రామాయణం థీమ్ పార్కుకు కేటాయించిన 11.76 ఎకరాల్లో కాటేజీలు కట్టాలని, దాతల ద్వారా నిర్మించాలని భావించినా పర్మిషన్రాక నిలిచిపోయాయి. థీమ్ పార్కు కలగానే మిగిలిపోయింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏపీ టూరిజం ద్వారా రూ. 2 కోట్లు కేటాయించారు. కడప నుంచి పెద్ద పెద్ద శిలలు తెప్పించారు. ఈలోపు రాష్ట్ర విభజన జరిగి, కేటాయించిన 11.76 ఎకరాలు ఆంధ్రాలో విలీనం కావడంతో పనులు నిలిచిపోయాయి.


అంజన్నకు మాస్టర్ ప్లాన్తోనే సరి
ఏటా రూ. 15 కోట్ల ఆదాయం తెచ్చే కొండగట్టు అంజన్న ఆలయ అభివృద్ధికి సర్కారు ఆదేశాలతో మూడేండ్ల కిందే మాస్టర్ ప్లాన్ రెడీ చేశారు. కలెక్టర్ శరత్  2018లో 333.3 ఎకరాల రెవెన్యూ భూములను సర్వే చేసి ఆలయానికి కేటాయించారు. కానీ మాస్టర్ ప్లాన్ నేటికీ ముందట పడటం లేదు. హనుమాన్ దీక్షా పరులకు మాల విరమణ చేయడానికి కనీసం మండపం కూడా లేదు.  2017లో  కొత్త కోనేరును నిర్మించినా.. అందులో నీళ్లు నింపలేక పోతున్నరు. 2018లో పాత ఘాట్ రోడ్డును మూసేసిన్రు. కొత్త ఘాట్ రోడ్డు పనులు ఇప్పటికీ స్టార్ట్ కాలేదు.


జోగులాంబకు వంద కోట్లెక్కడ?
అలంపూర్ జోగులాంబ అమ్మవారి ఆలయానికి రూ. 100 కోట్లు కేటాయిస్తామని, తాను దగ్గరుండి యుద్ధప్రాతి పదికన అన్ని పనులు చేయిస్తానని తుంగభద్ర పుష్కర సమయంలో సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. ఇప్పటిదాకా ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. ఆలయంలో సౌలతులు లేక భక్తులు ఇబ్బందులు పడుతున్నరు. దర్శనం తర్వాత విశ్రాంతి తీసుకోవడానికి రూములుగానీ, షెడ్లు కానీ  లేవు.  దీంతో భక్తులు  చెట్ల కిందే గడపాల్సి వస్తోంది. రాత్రి నిద్ర చేయాలని వచ్చే వారికి ఎలాంటి సౌలతులు లేవు. సరైన బస్సు సౌకర్యం కూడా లేదు. 
అష్టాదశ శక్తి పీఠాలలో ఐదవదైన ఆలంపూర్ జోగులాంబ అమ్మవారి గుడి తీవ్ర వివక్షకు గురవుతున్నది. ఏటా పదివేల మంది అమ్మవారి ఉపాసన చేస్తుంటారు. లక్షల్లో భక్తులు దర్శించుకుంటారు. జోగులాంబ అమ్మవారి ఆలయానికి రూ. 100 కోట్ల నిధులు కేటాయిస్తామని, తాను దగ్గరుండి యుద్ధప్రాతిపదికన అన్ని పనులు చేయిస్తానని తుంగభద్ర పుష్కర సమయంలో(2020లో)  గొందిమల్ల పుష్కర్ ఘాట్ లో పుష్కర స్నానం చేసిన సందర్భంగా సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. ఇప్పటిదాక ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. 


చెట్లకిందే బస 
ఆలయంలో సౌలతులు లేక భక్తులు  ఇబ్బందులు పడుతున్నారు. దర్శనం తర్వాత విశ్రాంతి తీసుకోవడానికి రూములుగానీ, షెడ్లు కానీ  లేవు.  దీంతో భక్తులు  చెట్ల కిందే గడపాల్సివస్తోంది. రాత్రి నిద్ర చేయాలని వచ్చే వారికి ఎలాంటి సౌలతులు లేవు. ఆలయంలో రోజూ అన్నదానం చేస్తారు. భక్తులు కూర్చొని భోజనం చేయడానికి భోజనశాల లేదు. గుడిలోనే చిన్న సత్రంలో భోజనాలు చేస్తున్నారు. దాతల సాయంతోనే కొన్ని పనులు చేస్తున్నారే తప్ప సర్కార్ నుంచి ఎలాంటి ఫండ్స్ రావడంలేదు.  చాలామంది అమ్మవారి సమక్షంలో పెండ్లి చేసుకోవాలని భావిస్తుంటారు. కానీ, ఇక్కడ కల్యాణమండపం కూడా నిర్మించలేదు. గుండ్లు గీయడానికి కల్యాణకట్ట తదితర సౌకర్యాలు లేవు. 


కొన్ని గుళ్లలో నిత్య పూజలు కరువు
జోగులాంబ సన్నిధిలో 10కిపైగా గుళ్లు ఉన్నాయి. వీటిలో రెండు, మూడింటిలోనే నిత్య పూజలు జరుగుతున్నాయి. పాప వినాశని, సంగమేశ్వర, నవబ్రహ్మ గుళ్లకు భక్తులు వెళ్లేందుకు సరైన సదుపాయాలు లేవు. శివరాత్రి బ్రహ్మోత్సవాలకు, వసంత పంచమికి భక్తులు భారీ సంఖ్యలో వస్తారు. వీకెండ్స్లో కూడా రద్దీ ఉంటుంది. ఆలయానికి సరైన బస్సు సౌకర్యం లేదు. సొంత వెహికల్స్లో వచ్చేవారికి  పార్కింగ్ సమస్య ఎదురవుతోంది. తుంగభద్ర నదిలో బోటింగ్ సౌకర్యం కల్పిస్తామన్న  హామీ కూడా గాల్లో కలిసింది. తెల్లారేసరికి అలంపూర్లో వందబెడ్ల హాస్పిటల్ ఏర్పాటు చేస్తానని కేసీఆర్ 2018 ఎన్నికల ప్రచారంలో ప్రకటించారు. డిగ్రీ కాలేజీ, ఫైర్ స్టేషన్, బస్సు డిపో  మంజూరు చేస్తానన్నారు. ఈ హామీలు కూడా అతీగతీ లేకుండా పోయాయి. 


కేంద్ర ‘ప్రసాదం’ స్కీమే దిక్కు
శక్తి పీఠమైన జోగులాంబ అమ్మవారి ఆలయాన్ని కేంద్ర ప్రభుత్వ ‘ప్రసాద్’ స్కీమ్లో చేర్చారు. రూ. 82 కోట్ల తో ప్రతిపాదనలు పంపగా కేంద్రం రూ. 36.70 కోట్లకు ఆమోదం తెలిపింది. ఈ నిధులతో పుట్ట ర్యాలంపాడు బ్రిడ్జి నుంచి శ్రీ సూర్యనారాయణ స్వామి, యోగ నరసింహస్వామి టెంపుల్ లను కలుపుతూ జోగులాంబ అమ్మవారి టెంపుల్ వరకు రోడ్డు నిర్మిస్తారు.  ర్యాలంపాడు బ్రిడ్జి దగ్గర 8 ఎకరాల లో, అలంపూర్లో నాలుగు ఎకరాల లో గ్రీన్ ఫీల్డ్ ఏర్పాటు చేస్తారు. గుళ్ల దగ్గర గ్రీనరీ, ఐ మాక్స్ లైట్లు ఏర్పాటు చేయనున్నారు. పార్కింగ్ సౌకర్యం ఏర్పాటు చేసి, గెస్ట్హౌజ్లు, లాకర్స్, టాయ్లెట్లు నిర్మిస్తారు. కేసీఆర్ ప్రకటించిన ఫండ్స్లో కొంతైనా రిలీజ్ చేసిఉంటే.. ‘ప్రసాద్’ స్కీం కింద వచ్చే ఫండ్స్తో ఆలయం మరింత అభివృద్ధి  చెందిఉండేదన్న అభిప్రాయాలున్నాయి.
 

Tagged government, TEMPLES, not care

Latest Videos

Subscribe Now

More News