
- సీఎంపీఎఫ్ కమిషనర్ హరి పచౌరి
- పెన్షన్ పేమెంట్ ఆర్డర్స్ అందజేత
కోల్‌బెల్ట్, వెలుగు: పెన్షన్ పొందుతున్న సింగరేణి రిటైర్డ్ ఎంప్లాయిస్‌కు మెరుగైన సేవలు అందిస్తున్నామని సీఎంపీఎఫ్కమిషనర్(రీజియన్) హరిపచౌరి అన్నారు. సోమవారం మందమర్రి సింగరేణి జీఎం ఆఫీస్‌లో ఏరియా ఏస్వోటుజీఎం విజయప్రసాద్అధ్యక్షతన నిర్వహించిన కోఆర్డినేటర్స్ కమిటీ మీటింగ్‌కు ఆయన చీఫ్ గెస్ట్‌గా హాజరయ్యారు. కొత్త పెన్షన్ స్కీం, ప్రావిడెంట్ ఫండ్, సీఎంపీఎఫ్ (భవిష్యనిధి) తదితర అంశాలపై ఏరియా ఆఫీసర్లతో చర్చించారు.
అనంతరం 583 రివైజ్డ్ పీపీవో పత్రాలను అధికారులకు అందజేశారు. ఈ సందర్భంగా కమిషనర్ హరిపచౌరీని సింగరేణి గుర్తింపు సంఘం ఏఐటీయూసీ మందమర్రి, రామకృష్ణాపూర్బ్రాంచి సెక్రటరీలు సలెంద్ర సత్యనారాయణ, ఎండీ అక్బర్అలీ, వైస్ ప్రెసిడెంట్ఇప్పకాయల లింగయ్య, జీఎం స్ట్రక్చర్ కమిటీ మెంబెర్ సీవీ రమణ సన్మానించారు. కార్యక్రమంలో ఇన్చార్జ్ పర్సనల్ మేనేజర్ ఆసిఫ్, సీఎంపీఎఫ్కమిషనర్-కె.గోవర్ధన్, సీనియర్ పర్సనల్ ఆఫీసర్ బి.శంకర్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.