వేములవాడ, వెలుగు: పేదల సంక్షేమమే సర్కారు ధ్యేయమని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. వేములవాడ పట్టణంలోని తన క్యాంప్ఆఫీస్లో శనివారం 19 మంది లబ్ధిదారులకు రూ.7 లక్షల విలువైన సీఎం సహాయనిధి చెక్కులు పంపిణీ చేశారు.
మహిళలకు ఉచిత ప్రయాణం, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, రూ.500కే సిలిండర్, రుణమాఫీ వంటి అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని తెలిపారు. నియోజకవర్గంలో వివిధ అనారోగ్య సమస్యలతో చికిత్స పొందిన వారికి సీఎం సహాయనిధి, ఎల్ వోసీ ద్వారా ఇప్పటివరకు రూ.20 కోట్ల పైచిలుకు బిల్లులు మంజూరు చేసినట్లు పేర్కొన్నారు.
వేములవాడ మార్కెట్ కమిటీ చైర్మన్ రొండి రాజు, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు చంద్రగిరి శ్రీనివాస్, నాయకులు మధు, రాజు, శ్రీనివాస్, రాములు తదితరులున్నారు.
రాజన్నపేట శివాలయ అభివృద్ధికి కృషి చేస్తా
ఎల్లారెడ్డిపేట, వెలుగు: రాజన్నపేట శివాలయ వార్షికోత్సవంలో భాగంగా శనివారం కాలభైరవ స్వామి, సంతాన నాగేంద్రస్వామి విగ్రహాల ప్రతిష్ఠ, మహాకుంభాభిషేకం, శివపార్వతుల కల్యాణం ఘనంగా నిర్వహించారు.
ప్రభుత్వ విప్ఆది శ్రీనివాస్కాంగ్రెస్సిరిసిల్ల నియోజకవర్గ ఇన్చార్జి కేకే.మహేందర్ రెడ్డితో కలిసి స్వామివారిని దర్శించుకున్నారు. హంపి పీఠాధిపతి కూడా ఇక్కడికి వచ్చి వెళ్లారని, శివాలయ అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తానని పేర్కొన్నారు.
