
వికారాబాద్, వెలుగు : మహిళలు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకొని ఆదర్శంగా నిలవాలని వికారాబాద్ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ సూచించారు. వికారాబాద్ టౌన్ లోని ధర్మ విద్యాలయంలో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా నియోజకవర్గ మహిళలు శిక్షణను పూర్తి చేసుకోగా.. గురువారం నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై ఆయన 60 మందికి ఉచిత కుట్టు మెషీన్లు, సర్టిఫికెట్లను పంపిణీ చేశారు.
అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ మహిళలను వంటింటికే పరిమితం చేయకుండా వారిలోని నైపుణ్యాలను గుర్తించి ప్రోత్సహించాలన్నారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.