అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్ షిప్ సీట్ల పెంపు .. 210 నుంచి 500కి పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు

అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్ షిప్ సీట్ల పెంపు .. 210 నుంచి 500కి పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు

హైదరాబాద్, వెలుగు: విదేశాల్లో ఉన్నత విద్యకు అందుబాటులో ఉన్న అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్ షిప్ సీట్లను ప్రభుత్వం పెంచింది. ప్రస్తుతం 210 సీట్లు ఉండగా ఈ సంఖ్యను 500కి పెంచుతూ ఎస్సీ సంక్షేమ శాఖ ఇన్​చార్జ్ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీధర్ బుధవారం జీవో జారీ చేశారు. వార్షికాదాయం రూ.5 లక్షల లోపు ఉండి గ్రాడ్యుయేషన్​లో 60 శాతం మార్కులు, జీఆర్ఈ, జీమ్యాట్, టోఫెల్, ఐఈఎల్ టీఎస్ లో అర్హత సాధించి వారికి ప్రతి ఏటా రెండు దశల్లో రూ.20 లక్షలను ప్రభుత్వం సాంక్షన్ చేస్తుంది. 

అమెరికా, లండన్, కెనడా, ఆస్ర్టేలియా, జర్మనీ, ఫ్రాన్స్, జపాన్, సౌత్ కొరియా, సింగపూర్, న్యూజిలాండ్ దేశాల్లో గుర్తింపు పొందిన యూనివర్సిటీలో అడ్మిషన్ సాధించిన వారికి ఈ స్కాలర్ షిప్ ను మంజూరు చేస్తున్నారు. ఈ పాస్ వెబ్ సైట్ లో ఈ స్కీమ్ కు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.