కంది పప్పు కిలో రూ.60 మాత్రమే.. భారత్ దాల్ బ్రాండ్ పేరుతో అమ్మకాలు

కంది పప్పు కిలో రూ.60 మాత్రమే.. భారత్ దాల్ బ్రాండ్ పేరుతో అమ్మకాలు

దేశంలో ఇప్పుడు ధరల సంక్షోభం నడుస్తుంది. నిత్యాసవరాల ధరలు అన్నీ భారీగా పెరిగాయి. టమాటా అయితే హద్దే లేకుండా పెరుగుతుంది. వాటితోపాటు పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి లాంటి సరుకులతోపాటు.. పప్పు ధాన్యాలు సైతం ధరల మంట మండిస్తున్నాయి. గత ఏడాది 90 నుంచి 100 రూపాయలుగా ఉన్న కిలో కందిపప్పు.. ఇప్పుడు రిటైల్ మార్కెట్ లో కిలో 130 రూపాయల వరకు పలుకుతుంది. గత ఏడాదితో పోల్చుకుంటే పప్పు ధాన్యాల ధరలు 7 నుంచి 32 శాతం వరకు ధరలు పెరిగాయని కేంద్రం గుర్తించింది. ఈ క్రమంలోనే పప్పు ధాన్యాల ధరలను కంట్రోల్ చేయటంతోపాటు.. పేదలకు సరసమైన ధరలకు కందిపప్పు అందించాలనే ఉద్దేశంతో.. భారత్ బ్రాండ్ పేరుతో.. కేంద్ర ప్రభుత్వం.. దేశ వ్యాప్తంగా 702 నాఫెడ్, మదర్ డైరీ, ఇతర కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే దుకాణాల ద్వారా విక్రయించాలని నిర్ణయించింది కేంద్ర ప్రభుత్వం. 

పప్పుల్లో చాలా రకాలు ఉన్నాయి. నాణ్యతను బట్టి కందిపప్పు ధర కనిష్టంగా కిలో ధర 80 నుంచి 135 రూపాయల వరకు వరకు పలుకుతుంది. ఈ ధరలను తగ్గించటానికి.. జానానికి తక్కువ ధరలో.. నాణ్యమైన పప్పు అందించాలనే ఉద్దేశంతో.. సబ్సిడీపై కేవలం కిలో 60 రూపాయలకే.. భారత్ బ్రాండ్ పేరుతో విక్రయించటానికి ఏర్పాట్లు చేస్తుంది మోదీ ప్రభుత్వం. భారత్ దాల్ పేరుతో.. టమాటాలను విక్రయించినట్లే వీటిని కూడా అమ్మాలని నిర్ణయించింది కేంద్రం.

భారతీయ వంటల్లో సంప్రదాయమైన ఆహారం అయిన కందిపప్పు ధరలకు కల్లెం వేయటంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. ఆయా రాష్ట్రాల్లో రేషన్ షాపులు, సహకార సంఘాలు విక్రయించే దుకాణాలు, జైళ్ల శాఖ ఆధ్వర్యంలో నడిచే దుకాణాల ద్వారా వీటిని సరఫరా చేయాలని ప్రణాళిక రచించింది. ఇప్పటికే ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు సమాచారం ఇవ్వటంతోపాటు.. సబ్సిడీపై కందిపప్పును పంపిణీ చేయటానికి కేంద్రం చర్యలు తీసుకుంది. ఢిల్లీలో ప్రభుత్వం ఆధ్వర్యంలో కిలో టమాటాను 60 రూపాయలకే విక్రయించిస్తున్న తరహాలోనే.. కందిపప్పును కూడా కిలో 60 రూపాయలకే అందించాలని నిర్ణయించింది. దీని వల్ల రిటైల్ మార్కెట్ లోనూ ధరలు తగ్గుతాయని అంచనా వేస్తుంది ప్రభుత్వం. 

గణనీయంగా పెరుగుతున్న ధరలను నియంత్రించటాలనే లక్ష్యంతో.. ఈ తరహా అమ్మకాలు చేపట్టినట్లు కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేస్తుంది. భారత్ దాల్.. భారత్ కందిపప్పు మీ ప్రాంతాల్లో అమ్ముతున్నారో లేదో తెలుసుకోండి.. రేషన్ షాపుల్లో ఎంక్వయిరీ చేయండి.. కందిపుప్పును సబ్సిడీపై కొనుగోలు చేయండి.. సోమవారం నుంచే అంటే.. 2023, జులై  17వ తేదీ నుంచే ఈ పథకాన్ని అమల్లోకి తీసుకొచ్చింది కేంద్రం.