న్యూఢిల్లీ: ఇజ్రాయెల్ సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలింది. టైమ్‌లోగా బడ్జెట్‌ను ఆమోదించలేకపోవడంతో అక్కడి పార్లమెంటు ‘నెస్సెట్ ’ మంగళవారం రద్దయింది. వచ్చే ఏడాది మార్చి 23న ఎన్నికలు జరగనున్నాయి. కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యే వరకు నెతన్యాహు ప్రధానిగా కొనసాగనున్నారు. ఆ దేశంలో గత రెండేళ్లలో ఇలా ఎన్నికలు జరగడం ఇది నాలుగోసారి.
అసలేం జరిగింది?
120 సీట్లున్న ఇజ్రాయెల్ పార్లమెంట్‌లో మ్యాజిక్ ఫిగర్ 61. గతేడాది ఏప్రిల్‌లో జరిగిన ఎన్నికల్లో అధికార నెతన్యాహు పార్టీకి గాని, ప్రతిపక్ష బెన్నీ గాంట్జ్ పార్టీకి గానీ మెజార్టీ రాలేదు. కూటముల ఏర్పాటు కూడా విఫలమైంది. దీంతో అదే ఏడాది సెప్టెంబర్‌లో మళ్లీ ఎలక్షన్స్ జరిగాయి. అప్పుడూ హంగ్ ఏర్పడింది. దీంతో 2020 మార్చిలో మూడోసారి ఎన్నికలు జరగ్గా నెతన్యాహు పార్టీకి 36, గాంట్జ్ పార్టీకి 33 సీట్లొచ్చాయి. అయితే కరోనా నేపథ్యంలో నెతన్యాహు, గాంట్జ్ తమ గొడవలను పక్కనబెట్టి మే నెలలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేశారు.
బడ్జెట్ పై ఏకాభిప్రాయం కుదరక..
కనీసం 7 నెలలు కూడా గడవకముందే 2 పార్టీల మధ్య విభేదాలొచ్చాయి. దేశ బడ్జెట్ పై ఏకాభిప్రాయం కుదరలేదు. మంగళవారం అర్ధరాత్రి
గడువులోగా బడ్జెట్‌ను ఆమోదించకపోవడంతో పార్లమెంటు రద్దయింది. దీంతో ప్రభుత్వం కూలి మళ్లీ ఎన్నికలకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది.
నెతన్యాహు ఓవైపు అవినీతి, మరోవైపు కరోనా కంట్రోల్లో విఫలమయ్యారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
నువ్వంటే నువ్వే కారణమంటూ..
ప్రభుత్వం కూలిపోవడంపై నెతన్యాహు, బెన్నీ పరస్పరం విమర్శలు చేసుకున్నారు. ‘కరోనా టైమ్‌లో ఎన్నికలకు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది.
ఏదేమైనా వచ్చే ఎన్నికల్లో మా పార్టీ విజయం సాధిస్తుంది’ అని నెతన్యాహు అన్నారు . ‘సొంత ప్రయోజనం కోసం, జైలుకు వెళ్లకుండా తప్పించుకునేందుకే నెతన్యాహు మళ్లీ ఎన్నికలకు వెళ్తున్నారు ’ అని బెన్నీ ఆరోపించారు.
నెతన్యాహు వరుసగా గెలుస్తూ..
ఇజ్రాయెల్‌కు చాలాకాలంగా నెతన్యాహు ప్రధానిగా కొనసాగుతున్నారు. 1996 నుంచి 99 వరకు తొలిసారి, తర్వాత 2009లో రెండోసారి
ప్రధాని అయ్యారు. అప్పటి నుంచి వరుసగా నాలుగుసార్లు గెలిచి పదవిలో కొనసాగుతున్నారు.
For More News..
వరంగల్ జిల్లాలో మరోజంట ఆత్మహత్య.. వారంలో ఇది మూడో జంట
కేసు ఫైల్ చేయలేదని పోలీసును రోడ్డు ఊడ్చమన్న కోర్టు
వీడియో: షారూర్ ఖాన్‌లా వార్నర్.. సోషల్ మీడియాలో వైరల్
