లాక్‌డౌన్ పెట్టె ఆలోచనలో మహారాష్ట్ర ప్రభుత్వం

లాక్‌డౌన్ పెట్టె ఆలోచనలో మహారాష్ట్ర ప్రభుత్వం

మహారాష్ట్రలో కరోనా కేసులు ప్రమాదకర స్థాయిలో పెరుగుతున్నాయి. దీంతో లాక్‌డౌన్ పెట్టే అవకాశముందని సీఎం ఉద్ధవ్ ఠాక్రే చెప్తున్నారు. ఈ విషయం గురించి సీఎం అధ్యక్షతన శనివారం ఆల్ పార్టీ మీటింగ్ జరిగింది. లాక్‌డౌన్  పరిధి, ఎన్నిరోజులు, ఎలా అనే విషయాలు త్వరలో ఖరారు చేస్తామని మహారాష్ట్ర మంత్రి అశోక్ చవాన్ అన్నారు. మహారాష్ట్రలో శనివారం ఒక్కరోజే 58,993 కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 301 మంది కరోనా బారినపడి చనిపోయారు. మహారాష్ట్రలో ఇప్పటి వరకు 32 లక్షల 88 వేల మందికి కరోనా వచ్చింది. ప్రస్తుతం దేశంలో ఉన్న యాక్టివ్ కేసుల్లో 50 శాతానికి పైగా మహారాష్ట్రలోనే ఉన్నాయి. 

అటు ఢిల్లీలోనూ కరోనా కంట్రోల్‌కు కేజ్రీవాల్ సర్కార్ కఠిన ఆంక్షలు విధించింది. స్థానిక మెట్రో రైళ్లు, బస్సులు 50 శాతం సీట్ల సామర్థ్యంతోనే నడపాలని నిర్ణయించింది. పెళ్లిళ్లు, ఇతర ఫంక్షన్లలో అతిథుల సంఖ్యను 50 మందికే పరిమితం చేసింది. రెస్టారెంట్లు, బార్లు కూడా 50 శాతం మందినే అనుమతించాలని అధికారులు తెలిపారు. మహారాష్ట్ర నుంచి వచ్చే విమాన ప్రయాణికులకు ఆర్టీపీసీఆర్ నెగెటివ్ రిపోర్ట్ తప్పనిసరి చేసింది.