సర్కార్ నీళ్లను సర్కారోళ్లే తాగుతలే

సర్కార్ నీళ్లను సర్కారోళ్లే తాగుతలే

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలు ఉత్పత్తి చేస్తున్న వాటర్ బాటిళ్లను సర్కార్ శాఖలే వినియోగించడం లేదు. విజయ డెయిరీ వాటర్ బాటిల్స్​ను, విజయ ఆయిల్స్, ఆయిల్ ఫెడ్ కలిసి తయారు చేస్తున్న కిన్నెర వాటర్ బాటిల్స్​ను ప్రభుత్వ డిపార్ట్​మెంట్లు కూడా కొనుగోలు చేయడం లేదు. రాష్ట్రంలో పాలనకు కేంద్రమైన బీఆర్కే భవన్​లో ఒక డిపార్ట్​మెంట్లో మినహా ఏ డిపార్ట్​మెంట్​లోనూ విజయ డెయిరీ మంచి నీళ్ల బాటిళ్లను వాడటం లేదు. అన్ని ప్రభుత్వ ఆఫీసులకూ మిషన్ భగీరథ నీళ్లు అంటూ వాటర్ బిజినెస్ లోకి దిగిన మిషన్ భగీరథ కార్పొరేషన్.. ఇప్పుడు ఆ వాటర్ బాటిళ్ల ప్రొడక్షనే ఆపేసింది. తాజాగా ఆర్టీసీ కూడా నీళ్ల వ్యాపారంపై ఫోకస్ పెట్టింది. మరి ఆర్టీసీ నీళ్ల బిజినెస్ అయినా బాగుంటుందో లేదో అన్న చర్చలు మొదలయ్యాయి. 

విజయ డెయిరీ.. రోజుకు 3 వేల లీటర్లే 

హైదరాబాద్ లో రోజుకు యావరేజ్​గా కోటి లీటర్ల వాటర్ బాటిళ్లు  అమ్ముడవుతుంటే..  ప్రభుత్వ రంగ సంస్థలు యావరేజ్ గా13 వేల లీటర్లు కూడా సేల్స్ చేయడం లేదు. మొదటగా విజయ డెయిరీ 2018లోనే వాటర్ బాటిళ్ల బిజినెస్​లోకి అడుగుపెట్టింది. హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లాలాపేటలో  వాటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్లాంటును నెలకొల్పింది. రోజూ 30 వేల లీటర్ల వరకు ప్రొడక్షన్ చేసి, సప్లై చేసే కెపాసిటీ ఉన్నప్పటికీ.. యావరేజ్​గా 4 వేల లీటర్ల మేరకే ఉత్పత్తి జరుగుతోంది. ఇందులో రోజూ 3,100 లీటర్ల మేరకు సేల్స్ అవుతున్నట్లు ఆఫీసర్లు చెప్తున్నారు. సెక్రటేరియేట్ (బీఆర్కే భవన్)లోనే పశుసంవర్ధక శాఖ స్పెషల్ సీఎస్ చాంబర్, పేషీ మినహా ఇతర డిపార్ట్​మెంట్లు, పేషీలలో అన్నీ ప్రైవేట్ కంపెనీల వాటర్ బాటిళ్లే దర్శనమిస్తున్నాయి.     

కిన్నెర పాయే.. భగీరథ రాకపాయే  

ప్రభుత్వం నిర్వహించే అధికారిక కార్యక్రమాలు, సమావేశాల్లో మిషన్ భగీరథ వాటర్ బాటిళ్లనే వినియోగించాలని ఆదేశించారు. సీఎం కేసీఆర్ కూడా రెండు సార్లు రివ్యూ మీటింగుల్లో అదే చెప్పారు. మొదట్లో కొన్ని ప్రభుత్వ కార్యక్రమాల్లోనూ ఆ బాటిల్స్ దర్శనమిచ్చాయి. ఆ తరువాత భగీరథ బాటిల్స్ ఆగిపోయాయి. మళ్లీ విజయ ఆయిల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ‘కిన్నెర’ పేరుతో నిరుడు వాటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బాటిల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను తెచ్చింది. రూ.3 కోట్లతో వాటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్లాంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఏర్పాటు చేసింది. అరలీటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బాటిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ధరను రూ.10గా, లీటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బాటిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ధరను రూ. 20గా నిర్ణయించారు. విజయ ఆయిల్స్ కు ఉన్న మార్కెటింగ్ వ్యవస్థను వాడుకుని సేల్స్​చేయాలని భావించారు. కానీ వీటి సేల్స్​కూడా ఎక్కువగా జరగడంలేదు. రోజుకు 24 వేల లీటర్లు సేల్ చేయాలని టార్గెట్ పెట్టుకున్నా.. మూడు వేలకు మించడంలేదు. 

ప్రైవేట్ కంపెనీలతో లాలుచీ వల్లే?

ఎంతో డిమాండ్ ఉన్న వాటర్ బిజినెస్ లో సర్కార్ సంస్థలు డీలా పడటానికి కారణం.. ఆఫీసర్లు ప్రైవేట్ కంపెనీలతో కుమ్మక్కు కావడమే కారణమని చెప్తున్నారు. తక్కువ ధరకు నాణ్యమైన నీటిని సేల్ చేస్తే.. భారీగానే లాభాలు వచ్చే చాన్స్ ఉన్నప్పటికీ ప్రభుత్వ రంగ సంస్థలు వెనక్కి తగ్గడం వెనక ప్రైవేట్ కంపెనీల లాబీయింగ్ ఉందని ఆఫీసర్లే చర్చించుకుంటున్నారు. తాజాగా నీళ్ల వ్యాపారంలోకి దిగుతున్న ఆర్టీసీకి కూడా బస్టాండ్లు, బస్సుల్లో నీళ్ల బాటిళ్ల సేల్స్ తో లాభాలు గడించే చాన్స్ ఉంది.