
మంచిర్యాల, వెలుగు: రాష్ట్రంలోని మెడికల్ కాలేజీలు, నర్సింగ్‌కాలేజీలు, వాటికి అనుబంధంగా ఉన్న వివిధ హాస్పిటళ్లలో పని చేస్తున్న కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ సర్వీస్‌ను ప్రభుత్వం మరో ఏడాది పొడిగించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్‌కుమార్ సుల్తానియా ఆర్డర్స్జారీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ పరిధిలో 16,448 మంది కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ఎంప్లాయీస్ పని చేస్తున్నారు.
ఆయా కాలేజీలు, హాస్పిటల్స్‌లో ఖాళీలను బట్టి పలు దఫాలుగా వీరిని విధుల్లోకి తీసుకున్నారు. కాంట్రాక్ట్ ఎంప్లాయీస్‌ను డైరెక్టుగా ప్రభుత్వమే రిక్రూట్ చేయగా, ప్రైవేట్ ఏజెన్సీల ద్వారా ఔట్ సోర్సింగ్ సిబ్బందిని నియమించారు. ఏడాదికోసారి వీరి సర్వీస్‌ను పొడిగించుకుంటూ వస్తున్నారు. ప్రస్తుతం 4,772 మంది కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ పని చేస్తుండగా, ఔట్ సోర్సింగ్‌లో 8,615 మంది, హానరోరియంపై 3,056 మంది కొనసాగుతున్నారు. మరో ఐదుగురు మల్టీ టాస్కింగ్స్టాఫ్(ఎంటీఎస్) ఉన్నారు. 2025 ఏప్రిల్ ఒకటి నుంచి వచ్చే ఏడాది మార్చి 31 వరకు వీరు కంటిన్యూ అవుతారు.
మంచిర్యాలకు మరో 80 పోస్టులు..
మంచిర్యాల మెడికల్ కాలేజీ, జీజీహెచ్ పరిధిలో ప్రస్తుతం 105 మంది ఔట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ పని చేస్తున్నారు. ప్రభుత్వం తాజాగా మరో 80 పోస్టులను మంజూరుచేసింది. వీరి నియామకంతో స్టాఫ్ కొరత పూర్తిగా తీరనుందని అధికారులు తెలిపారు.