
- టెలికం కంపెనీలను ఆదేశించిన ప్రభుత్వం
న్యూఢిల్లీ: ఇండియన్ మొబైల్ నెంబర్ డిస్‌ప్లే అవుతూ వచ్చే ఇంటర్నేషనల్ ఇన్‌కమింగ్ కాల్స్‌ను బ్లాక్ చేయాలని టెలికం కంపెనీలను ప్రభుత్వం ఆదేశించింది. ఇండియన్ మొబైల్ నెంబర్‌తో ఇంటర్నేషనల్ స్పూఫ్డ్ కాల్స్‌ను సైబర్ మోసగాళ్లు చేస్తున్నారు.
ఇలాంటి కాల్స్ ఇండియా నుంచే వచ్చినట్లు కనిపిస్తాయి. కానీ, ఇవి విదేశాల నుంచి వస్తాయి. కాలింగ్ లైన్ ఐడెంటిటీని మానిప్యులేట్ చేయడం ద్వారా ఇండియన్ మొబైల్ నెంబర్ డిస్‌ప్లే అవుతోంది. ఫెడ్ఎక్స్ స్కామ్స్, పేక్ డిజిటల్ అరెస్ట్‌లు, డ్రగ్స్ లేదా నార్కోటిక్స్ కొరియర్ వంటి సైబర్ మోసాలు జరుగుతున్నాయి. ఇటువంటి కాల్స్‌ను బ్లాక్ చేసేందుకు డాట్, టెలికం కంపెనీలు ఓ స్టిస్టమ్‌ను డెవలప్ చేశాయి.