రాష్ట్రాలకు కేంద్రం గుడ్‌‌ న్యూస్‌‌

రాష్ట్రాలకు కేంద్రం గుడ్‌‌ న్యూస్‌‌

న్యూఢిల్లీ: రాష్ట్రాలకు చెల్లించాల్సిన జీఎస్‌‌టీ కాంపెన్సేషన్‌‌లో భాగంగా రూ. 35 వేల కోట్లను త్వరలో చెల్లించనున్నట్లు కేంద్ర ప్రభుత్వ అధికారి ఒకరు వెల్లడించారు. జీఎస్‌‌టీ రాకతో రాష్ట్రాలు కోల్పోయే రెవెన్యూ భర్తీకి మొదటి అయిదేళ్లూ కాంపెన్సేషన్‌‌ చెల్లించడానికి కేంద్రం ఒప్పుకున్న విషయం తెలిసిందే. బేస్‌‌ ఇయర్‌‌  2, గత రెండు ఆర్థిక సంవత్సరాలతోపాటు, ఈ ఆర్థిక సంవత్సరపు తొలి నాలుగు నెలల్లో కాంపెన్సేషన్‌‌ చెల్లింపుపై కేంద్రం, రాష్ట్రాల మధ్య ఎలాంటి తేడాలూ లేవు. ఐతే, కాంపెన్సేషన్‌‌ సెస్‌‌ వసూళ్లు సరిపోకపోవడంతో ఆగస్టు 2019 నుంచీ రాష్ట్రాలకు కాంపెన్సేషన్‌‌ చెల్లింపులలో జాప్యం జరుగుతోంది.