V6 News

ప్రజల చెంతకు ప్రభుత్వ పథకాలు : ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి 

ప్రజల చెంతకు ప్రభుత్వ పథకాలు : ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి 

ఆమనగల్లు, వెలుగు : ప్రజా ప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేసి ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి పిలుపునిచ్చారు. గురువారం కడ్తాల్, ఆమనగల్లు మండల కేంద్రాల్లో నిర్వహించిన ‘ప్రగతి ప్రణాళిక’ సమావేశాల్లో పొదుపు సంఘాల మహిళలకు వడ్డీ లేని రుణాలను అందజేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అభివృద్ధి పనుల విషయంలో కొందరు అధికారులు ప్రోటోకాల్ పాటించకుండా ఇష్టానుసారంగా వ్యవహరించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, పద్ధతి మార్చుకోకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.