ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరాలి : దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ

ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరాలి : దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ

వర్ధన్నపేట, వెలుగు: ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు ప్రజలకు మరింత చేరవేసేందుకే గ్రామసభలు నిర్వహిస్తున్నట్లు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం కొత్తపల్లిలో 99 రోజుల ప్రజా పాలన– ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఏర్పాటుచేసిన గ్రామసభలో ఎమ్మెల్యే నాగరాజుతో కలిసి మంత్రి పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా మంత్రి రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు చేరువగా పాలన అందించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నదని తెలిపారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని సూచించారు. ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడుతూ ప్రతిపక్ష నాయకులు ప్రతి మంచి పనిని అవహేళన చేస్తూ మాట్లాడుతున్నారని విమర్శించారు. 

కొత్త పెన్షన్లు మే నుంచి ఇస్తామని వెల్లడించారు. కలెక్టర్ సత్య శారద 99 రోజుల కార్యాచరణ ప్రణాళికపై వివరించారు. కార్యక్రమంలో వరంగల్​ ఆర్డీవో సుమ, జడ్పీ సీఈవో రాంరెడ్డి తదితరుల పాల్గొన్నారు. కాగా, వర్ధన్నపేట మున్సిపాలిటీలో నిర్వహించిన వార్డు సభ కార్యక్రమానికి చైర్ పర్సన్​ పాలకుర్తి సారంగపాణి ప్రభుత్వ సంక్షేమ పథకాలపై వివరించారు. మున్సిపల్ కమిషనర్ సుధీర్ కుమార్, వైస్ చైర్మన్ నేతవత్ శిభారాణి, కౌన్సిలర్లు పాల్గొన్నారు.