
జన్నారం/ఖానాపూర్/కుంటాల/దండేపల్లి, వెలుగు: ఉమ్మడి జిల్లాకు చెందిన ప్రభుత్వ స్కూళ్ల స్టూడెంట్లు సత్తాచాటి ప్రతిష్ఠాత్మక ట్రిపుల్ ఐటీకి ఎంపికయ్యారు. జన్నారం మండలంలోని వివిధ గవర్నమెంట్ స్కూళ్లకు చెందిన 12 మంది స్టూడెంట్లు ట్రిపుల్ ఐటీకి ఎంపికైనట్లు ఎంఈవో విజయ్ కుమార్ తెలిపారు. కిష్టాపూర్ గవర్నమెంట్ హైస్కూల్‌కు చెందిన ఆరుగురు స్టూడెంట్లు రాథోడ్ యోగేశ్వర్, ఎల్పుల నరేందర్, కొత్త అనిల్, మూగల హారిక, కామర హారిక, పెరుగు అక్షర, కలమడుగు హైస్కూల్ నుంచి షేక్ అశ్వక్, సాయి శ్రీకర్, గర్ల్స్ హైస్కూల్లో చదివిన శ్రీనిధి, చింతగూడ హైస్కూల్ నుంచి జావ్ గంగాభవాని, లకావత్ దీపిక, ఇందన్ పల్లి హైస్కూల్ లో చదివిన సంజన ఎంపికయ్యారని పేర్కొన్నారు.
ఎంపికైన విద్యార్థులకు సన్మానం
ఖానాపూర్ తో పాటు మండలంలోని మస్కాపూర్ లో చదివిన 10 మంది విద్యార్థులు ట్రిపుల్ ఐటీలో అవకాశం దక్కించుకున్నారు. ఖానాపూర్ పట్టణంలోని జడ్పీ హైస్కూల్‌కు చెందిన షేక్ అయాన్ తో పాటు మస్కాపూర్ లోని జడ్పీఎస్‌ఎస్‌లో చదివిన 9 మంది విద్యార్థులు శ్రీవల్లి, రాజు, స్నిగ్ధ, ఆదర్శిని, రోహిత్, హర్షిణి, రాహిల్, హర్షవర్ధన్, నందిని ఎంపికయ్యారు. వీరిని శనివారం స్కూల్ ఆవరణలో టీచర్లు, కాంగ్రెస్ నాయకులు, గ్రామస్తులు ఘనంగా సన్మానించారు.
హెచ్ఎం నరేందర్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు దయానంద్ తదితరులు పాల్గొన్నారు. కుంటాల మండల కేంద్రంలోని మోడల్ స్కూల్ విద్యార్థులు విగ్నేశ్వర్, గజానంద్ సైతం ట్రిపుల్ఐటీకి ఎంపికయ్యారు. వారిని శనివారం ప్రిన్సిపాల్ నవీన్ కుమార్, సిబ్బంది అభినందించారు. దండేపల్లి మండలం వెల్గనూరు ప్రభుత్వ హైస్కూల్ విద్యార్థిని మ్యాన అక్షయ ఐఐఐటీకి ఎంపికైనట్లు హెచ్ఎం కె.విజయలక్ష్మి తెలిపారు.