ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు నాణ్యమైన విద్య, వసతులు కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నదని మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీతక్క తెలిపారు. సినీ నటి మంచు లక్ష్మి ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలల నిధుల సేకరణ కోసం శుక్రవారం మాదాపూర్ నోవాటెట్లో నిర్వహించిన ‘టీచ్ ఫర్ చేంజ్’ కార్యక్రమానికి వారు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ.. సమాజంలో మార్పు చదువుతోనే సాధ్యమన్నారు. మంచు లక్ష్మి చేస్తున్న సేవలను కొనియాడారు. మారుమూల ప్రాంతాల్లోని పాఠశాలలను అభివృద్ధి చేసేందుకు కార్పొరేట్ సంస్థలు సీఎస్ఆర్ నిధులతో ముందుకు రావాలని కోరారు.
నిధుల సేకరణలో భాగంగా సినీ హీరోయిన్ల ర్యాంప్ వాక్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు, సినీ ప్రముఖులు పాల్గొన్నారు.
