వరదలతో నష్టపోయిన రైతులందరిని ఆదుకుంటాం

వరదలతో నష్టపోయిన రైతులందరిని ఆదుకుంటాం

నిర్మల్, వెలుగు: ఇటీవల జిల్లాలో కురిసిన భారీ వర్షాలు, వరదల కారణంగా పంటలు దెబ్బతిన్న ప్రతి రైతుకు నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య స్పష్టం చేశారు. నిర్మల్​జిల్లా సోన్ మండలం కడ్తాల్ లో తెగిపోయిన పెద్ద చెరువు కట్టను బుధవారం కలెక్టర్​తో కలిసి ఆయన పరిశీలించారు. 

ఈ సందర్భంగా రైతులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వాగు ప్రవాహన్ని దాటి చెరువుగట్టుకు చేరుకొని జరిగిన నష్టాన్ని తెలుసుకున్నారు. వరదల కారణంగా నష్టపోయిన రోడ్లకు వెంటనే రిపేర్లు చేయిస్తామన్నారు. పంట నష్టంపై నివేదికల సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. డీసీసీ ప్రెసిడెంట్ శ్రీహరి రావు తదితరులు పాల్గొన్నారు.