వికారాబాద్ జిల్లా తాండూర్ పట్టణంలో గవర్నమెంట్ టీచర్ మిస్సింగ్

 వికారాబాద్ జిల్లా తాండూర్ పట్టణంలో గవర్నమెంట్ టీచర్ మిస్సింగ్

వికారాబాద్‌‌, వెలుగు: వికారాబాద్ జిల్లా తాండూర్ పట్టణంలోని తులసి నగర్‌‌ కు చెందిన ప్రభుత్వ టీచర్​ అరుణ అదృశ్యమయ్యారు. ఆమె హైదరాబాద్​ బడంగ్‌‌పేట్ జడ్పీ హైస్కూల్​ సైన్స్ టీచర్​గా విధులు నిర్వహిస్తున్నారు.

శనివారం ఉదయం తాండూర్ నుంచి హైదరాబాద్‌‌కు బయల్దేరింది. ఇమ్లిబన్ బస్‌‌స్టేషన్‌‌లో దిగిన అనంతరం ఆచూకీ తెలియలేదు. ఆమెకు మతిస్థిమితం సరిగా లేదని భర్త దేవేందర్​రెడ్డి తెలిపారు. ఆచూకీ తెలిస్తే 94902 69308 నంబర్‌‌కు సమాచారం ఇవ్వాలని కోరారు.