మల్లాపూర్, వెలుగు: జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలకేంద్రంలోని ప్రైమరీ స్కూల్‌లో ద్యావనపల్లి స్రవంతి ఎస్జీటీగా పనిచేస్తున్నారు. ఆమెకు ఇద్దరు పిల్లలు. కొడుకు యువన్ 5వ తరగతి చదువుతుండగా.. కూతురు జస్విత థర్డ్ క్లాస్. వారిద్దరిని తాను పనిచేస్తున్న స్కూల్‌లోనే చేర్చారు.
విషయం తెలుసుకున్న డీఈవో రాము.. గురువారం టీచర్‌ను అభినందించి సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ టీచర్లు.. సర్కార్ స్కూళ్లలో జాయిన్ చేసేందుకు ముందుకు రావడం శుభపరిణామమన్నారు.
