కేటీఆర్లో ఫ్రస్టేషన్ పెరుగుతోంది : ఆది శ్రీనివాస్

కేటీఆర్లో ఫ్రస్టేషన్ పెరుగుతోంది : ఆది శ్రీనివాస్
  • ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్​ 

వేములవాడ, వెలుగు: బీఆర్ఎస్​ వర్కింగ్ ​ప్రెసిడెంట్​ కేటీఆర్​లో ఫ్రస్టేషన్​ పెరుగుతోందని, వరుస ఎన్నికల్లో ప్రజలు తిరస్కరిస్తుంటే ఏం మాట్లాడుతున్నారో ఆయనకే అర్థమైతలేదని ప్రభుత్వ విప్​ఆది శ్రీనివాస్​ విమర్శించారు. రాష్ట్రంలో పదేండ్ల పాటు తుగ్లక్ పాలన సాగించి, రెండేండ్ల ప్రజా పాలనపై విషం చిమ్ముతున్నారని మండిపడ్డారు. శనివారం వేములవాడ పట్టణంలోని గంగమ్మ ఆలయం వద్దకు బ్రిడ్జి, షాదీఖానా నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.

రాష్ట్రంలో 65 శాతం మంది సర్పంచులు కాంగ్రెస్ మద్దతు తెలిపిన వారు గెలిస్తే కేటీఆర్ కాలుకు బలపం కట్టినట్లు సన్మానాల పేరిట ఊరేగుతున్నారన్నారు. దమ్ముంటే మీ చెల్లి కవిత వేసే ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పేదల సంక్షేమం, అభివృద్ధే ధ్యేయంగా ముందుకెళ్తోందని పేర్కొన్నారు. మున్పిపల్ కమిషనర్​అన్వేశ్, మార్కెట్​కమిటీ చైర్మన్​రొండి రాజు, నాయకులు శ్రీనివాస్​గౌడ్, రాకేశ్, పుల్కం రాజు, పంపరి శంకర్, అక్రమ్​పాషా తదితరులున్నారు.   

కాంగ్రెస్ లో చేరిక

వేములవాడ మున్సిపల్ ఎన్నికల వేళ బీజేపీకి భారీ షాక్​ తగిలింది. ఆ పార్టీ పట్టణ ప్రధాన కార్యదర్శి బోనాల శివ తన అనుచరులు 100 మందితో కలిసి శనివారం కాంగ్రెస్ లో చేరారు.  ప్రభుత్వ విప్​ఆది శ్రీనివాస్ వారికి కండువాలు కప్పి ఆహ్వానించారు.