
వేములవాడ, వెలుగు : వేములవాడ, నియోజకవర్గ పరిధిలో పెండింగ్ పనులు త్వరగా పూర్తి చేయాలని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అధికారులకు సూచించారు. శనివారం పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో పంచాయతీ రాజ్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
నియోజకవర్గ పరిధిలో ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న రోడ్లు, పలు అభివృద్ధి పనుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. సీఆర్ఆర్, ఎంఆర్ఆర్ పనులను సకాలంలో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో ఈఈలు సుదర్శన్ రెడ్డి, లక్ష్మణ్ రావు, డీఈలు పనవన కుమారి, సత్యనారాయణ, విష్ణువర్ధన్, ఏఈలు పాల్గొన్నారు.