మందమర్రిలో సుమన్ ​ప్రచారం షురూ

మందమర్రిలో సుమన్ ​ప్రచారం షురూ

కోల్​బెల్ట్, వెలుగు : ఎన్నికల ప్రచారంలో భాగంగా నవంబర్​ 7న మందమర్రికి సీఎం కేసీఆర్​ రానున్నట్లు ప్రభుత్వ విప్ బాల్క సుమన్​ తెలిపారు. శుక్రవారం ఆయన మందమర్రిలో ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. ముందుగా స్థానిక ఏడో వార్డు పాలచెట్టు ఏరియాలోని పంచముఖి ఆంజనేయస్వామి ఆలయంలో పూజలు చేసిన అనంతరం ఇంటింటా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 7న మందమర్రి సింగరేణి హైస్కూల్​ గ్రౌండ్​లో నిర్వహించే సీఎం కేసీఆర్​ ప్రజా ఆశీర్వాద బహిరంగసభను సక్సెస్​ చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం ఆయన ఆయా దుకాణాదారులతో మాట్లాడుతూ వారు చేసే పనిని అతడు చేసి ఉత్తేజపరిచారు. బీఆర్​ఎస్​ మేనిఫెస్టో పాంప్లేట్స్​ అందజేశారు.  సీఎం కేసీఆర్​ బహిరంగసభ నిర్వహించే సింగరేణి హైస్కూల్​ గ్రౌండ్​ను బీఆర్ఎస్​ శ్రేణులతో కలిసి పరిశీలించారు.