రూరల్ మేషన్ ట్రైనింగ్ ప్రోగ్రామ్‌‌‌‌లో భాగంగా., తాపీ మేస్ర్తీలకు ట్రైనింగ్

రూరల్ మేషన్ ట్రైనింగ్ ప్రోగ్రామ్‌‌‌‌లో భాగంగా., తాపీ మేస్ర్తీలకు ట్రైనింగ్

హైదరాబాద్, వెలుగు: రూరల్ మేషన్ ట్రైనింగ్ ప్రోగ్రామ్‌‌‌‌లో భాగంగా తాపీ మేస్ర్తీలకు ప్రభుత్వం శిక్షణ ఇవ్వనుంది. కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలోని ఆర్ఎస్‌‌ఈటీఐ  ద్వారా ఈ ట్రైనింగ్ ఇవ్వనుంది. ఇందుకోసం ప్రతి జిల్లా నుంచి కనీసం 240 మందిని ఎంపిక చేయాలని హౌసింగ్ ప్రాజెక్టు డైరెక్టర్లను హౌసింగ్ శాఖ సెక్రటరీ వీపీ గౌతమ్ ఆదివారం ఆదేశించారు. ఎంపిక చేసిన తాపీ మేస్త్రీలకు 30 నుంచి 45 రోజుల పాటు క్లాస్‌‌రూమ్, ఫీల్డ్ ట్రైనింగ్ ఇవ్వనున్నారు. ఆ టైమ్‌‌లో ఉచిత వసతి కల్పించనున్నారు. అనంతరం వాళ్ల సేవలను ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో ఉపయోగించుకోనున్నారు.