
న్యూడిల్లీ: కేంద్ర ప్రభుత్వం ఆదాయపు పన్ను బిల్లు, 2025ను ఉపసంహరించుకుంది. ఈ బిల్లును ఫిబ్రవరి 13న లోక్‌సభలో ప్రవేశపెట్టారు. 1961 నాటి పాత చట్టం స్థానంలో కొత్త చట్టం తీసుకురావాలనేది దీని లక్ష్యం. మార్పులు చేసిన కొత్త బిల్లును సోమవారం పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు. సెలెక్ట్ కమిటీ ఇచ్చిన అనేక సిఫార్సులను ఇందులో చేర్చారు.
గందరగోళాన్ని నివారించడానికి పాత బిల్లును వెనక్కి తీసుకున్నామని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఈ కొత్త బిల్లు పన్ను వ్యవస్థను మరింత సులభతరం చేస్తుందని, పన్ను చెల్లింపుదారులు సులభంగా నిబంధనలను అర్థం చేసుకుంటారని పేర్కొంది. కొత్త బిల్లులో భాష సులువుగా ఉంటుంది. చాప్టర్ల సంఖ్య కూడా తగ్గుతుంది.