కరోనా టెస్టులపై ప్రభుత్వ నిర్ణయం రాజ్యాంగ విరుద్ధం: హైకోర్టు

కరోనా టెస్టులపై ప్రభుత్వ నిర్ణయం రాజ్యాంగ విరుద్ధం: హైకోర్టు

తెలంగాణలో కరోనా పరీక్షలపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రైవేట్ ఆస్పత్రుల్లో కరోనా పరీక్షలకు ప్రభుత్వం ఎందుకు అనుమతించడం లేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. అంతేకాదు గాంధీ, నిమ్స్‌లోనే కరోనా పరీక్షలు చేయించుకోవాలనడం రాజ్యంగ విరుద్ధమని అభిప్రాయపడింది.

ప్రైవేట్ ఆస్పత్రులు, ల్యాబ్స్‌లో కరోనా పరీక్షలు, చికిత్సలపై ఇవాళ(బుధవారం) హైకోర్టు తీర్పునిచ్చింది. ప్రైవేట్ పరీక్ష కేంద్రాల్లో డబ్బులు చెల్లించి పరీక్షలు చేయించుకోడం ప్రజల హక్కు అని చెప్పింది. ప్రైవేట్ ఆస్పత్రులు, ల్యాబ్స్‌పై నమ్మకం లేకపోతే ఆరోగ్యశ్రీ సేవలకు ఎలా అనుమతిచ్చారని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. కరోనా సేవల కోసం ప్రైవేట్ ఆస్పత్రులు, ల్యాబ్స్‌ ICMRకు  దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఆస్పత్రులు, ల్యాబ్స్‌లో  వైద్య సిబ్బంది, సదుపాయాలను పరిశీలించి ICMR నోటిఫై చేయాలని చెప్పింది. అలా  ICMR ఆమోదించిన ఆస్పత్రుల్లోనే కరోనా చికిత్సలకు అనుమతించాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.