డైనింగ్ హాల్ నిర్మాణానికి భూమిపూజ

డైనింగ్ హాల్ నిర్మాణానికి భూమిపూజ

ఎడపల్లి, వెలుగు: మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నిర్మించ తలపెట్టిన డైనింగ్​ హాల్​ నిర్మాణానికి అభయ స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకుడు సుంకు బాలచంద్ర స్వామి గురువారం భూమిపూజ చేశారు. సంస్థ ఆధ్వర్యంలో స్కూల్​లో రూ.15 లక్షలతో విద్యార్థులు భోజనం చేసేందుకు డైనింగ్​హాల్​ నిర్మించేందుకు నిధులు సమకూర్చారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలలో చదివే పేద విద్యార్థుల అభ్యున్నతి  కోసం అభయ స్వచ్ఛంద సంస్థ కృషి చేస్తుందని తెలిపారు.

గ్రామీణ ప్రాంతంలో నేటికీ చాలా మంది పిల్లలు చదువుకు దూరంగా ఉన్నారని, అలాంటి వారిలో మార్పు తెచ్చేందుకు కృషి చేయాలని కోరారు. అభయ సంస్థ ఆధ్వర్యంలో నిరుద్యోగులు, యువత, మహిళలను ప్రోత్సహించేందుకు వివిధ రంగాల్లో ఉచితంగా శిక్షణ ఇప్పిస్తామని తెలిపారు. పేద విద్యార్థులు ఉన్నత చదువులు చదివేందుకు సాయం చేస్తామని చెప్పారు. తహసీల్దార్  దత్తాత్రి, సర్పంచ్  కందగట్ల రాంచందర్, ఉప సర్పంచ్  గంగాధర్, హెచ్ఎం రవికుమార్, గ్రామస్తులు మల్కారెడ్డి, మోహన్ రెడ్డి, బంజ శంకర్, వార్డు మెంబర్​ విఠల్  పాల్గొన్నారు.