దోమకొండ మండలం ముత్యంపేట లో అక్రమ కట్టడాల కూల్చివేత

దోమకొండ  మండలం ముత్యంపేట లో అక్రమ కట్టడాల కూల్చివేత

కామారెడ్డి, వెలుగు: దోమకొండ  మండలం ముత్యంపేట ప్రభుత్వ పాఠశాల స్థలాన్ని ఆక్రమించి ప్రైవేట్  వ్యక్తులు కడుతున్న రూమ్​లను హైకోర్టు ఆదేశాలతో గురువారం కూల్చివేశారు. గతంలో ఉప సర్పంచ్​గా పని చేసిన శిరీష్​​గౌడ్​ కుటుంబసభ్యులు రూమ్స్​ నిర్మిస్తున్నారు.

దీనిపై స్థానికులు హైకోర్టుకు వెళ్లడంతో వాటిని కూల్చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. కోర్టు ఆదేశాలతో అధికారులు పోలీసు బందోబస్తు మధ్య కట్టడాలు కూల్చివేశారు. దీంతో స్థానికంగా ఉద్రిక్తత నెలకొంది.