ఓటు వేసిన గవర్నర్ దంపతులు

ఓటు వేసిన గవర్నర్ దంపతులు

రాష్ట్ర గవర్నర్ నరసింహన్ ఓటు వేశారు. సోమాజీగూడ ఎంఎస్ మక్తాలోని అంగన్ వాడీ కేంద్రంలో గవర్నర్ దంపతులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. గవర్నర్ మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయని అన్నారు. ప్రతీ ఒక్కరూ బాధ్యతగా ఓటు వేయాలని కోరారు.

ఉదయం 5.30 నిలకు మాక్ పోలింగ్ నిర్వహించారు. ఆర్వాత పొద్దున 7గంటలకు పోలింగ్ మొదలైంది. తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి బారులు తీరారు. నగరంలో కొన్ని చోట్ల ఓట్లు గల్లంతయ్యాయి. దీంతో ఓటర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.