
అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా రాజ్ భవన్ సంస్కృతి భవనంలో యోగా కార్యక్రమం నిర్వహించారు. యోగా కార్యక్రమంలో గవర్నర్ నరసింహన్ దంపతులు, రాజ్ భవన్ సిబ్బంది పాల్గొన్నారు. అందరికీ యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు గవర్నర్. యోగా అనేది మనుసుకు ఆహ్లాదాన్ని ఇస్తుందని చెప్పారు. ఇకపై రోజు యోగా తరగతులు నిర్వహిస్తామని అన్నారు. ప్రతి ఒక్కరు యోగా చేయాలనీ.. ఆసనాలతో ఎన్నో లాభాలు ఉన్నాయని చెప్పారు. రాజ్ భవన్ స్టాఫ్ అందరి కోసం యోగా శిక్షణ తరగతులు నిర్వహిస్తామని చెప్పారు నరసింహన్.
రోజూ యోగా చేస్తే డాక్టర్ దగ్గరకు వెళ్లే అవసరం ఉండదని నరసింహన్ చెప్పారు. ప్రతి స్కూల్, కాలేజీల్లో యోగా తరగతులు నిర్వహించాలని ఈ సందర్భంగా గవర్నర్ కోరారు.