అభివృద్ధి పనులు ఆలస్యమవుతున్నయ్.. ఎన్వోసీలు త్వరగా ఇవ్వండి : ఎమ్మెల్యే శ్రీగణేశ్

 అభివృద్ధి పనులు ఆలస్యమవుతున్నయ్.. ఎన్వోసీలు త్వరగా ఇవ్వండి : ఎమ్మెల్యే శ్రీగణేశ్
  • కంటోన్మెంట్ బోర్డు అధికారులను కోరిన ఎమ్మెల్యే శ్రీగణేశ్

పద్మారావునగర్, వెలుగు: కంటోన్మెంట్ బోర్డు సీఈవో అరవింద్ ద్వివేది, డీఈవో దినేశ్ రెడ్డితో స్థానిక ఎమ్మెల్యే శ్రీగణేశ్ బుధవారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో చేపట్టాల్సిన పలు అభివృద్ధి పనులపై అధికారులతో విస్తృతంగా చర్చించారు.స్టేట్ డెవలప్​మెంట్ ఫండ్స్ ద్వారా చేపట్టనున్న అభివృద్ధి పనులకు కంటోన్మెంట్ బోర్డు నుంచి మంజూరు కావాల్సిన ఎన్​వోసీలు ఆలస్యంగా రావడం వల్ల పనులు కుంటుపడుతున్నాయని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.

ఎన్​వోసీలు త్వరితగతిన జారీ చేస్తే అభివృద్ధి పనులు వేగంగా పూర్తి చేయవచ్చన్నారు. దీనిపై స్పందించిన బోర్డు అధికారులు అవసరమైన ఎన్​వోసీలు త్వరగా మంజూరు చేసేలా చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు.