చైనా మాంజా విక్రయిస్తే కఠిన చర్యలు : ఇన్స్పెక్టర్ రమేశ్గౌడ్

చైనా మాంజా విక్రయిస్తే కఠిన చర్యలు : ఇన్స్పెక్టర్ రమేశ్గౌడ్

పద్మారావునగర్‌, వెలుగు: ప్రమాదాలకు కారణమవుతున్న చైనా మాంజా విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని మహంకాళి ఇన్​స్పెక్టర్ రమేశ్​గౌడ్ హెచ్చరించారు. బుధవారం ఎస్‌ఐ పూల్‌సింగ్, ఏఎస్‌ఐ డానియల్‌తో పాటు పోలీసు బృందం సికింద్రాబాద్‌లో పతంగులు విక్రయించే దుకాణాలను తనిఖీ చేసింది. మహంకాళి పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఎనిమిది పతంగుల దుకాణాలను పరిశీలించిన అధికారులు, వ్యాపారులకు చైనా మాంజా వల్ల కలిగే ప్రమాదాలపై అవగాహన కల్పించారు.

చైనా, నైలాన్‌, సింథటిక్ మాంజా రోడ్లు, కరెంట్‌ స్తంభాలు, బ్రిడ్జిలపై చిక్కుకోవడం వల్ల  పక్షులు, వాహనదారులు, పాదచారులు ప్రమాదాలకు గురవుతున్నారని అన్నారు. వాటిని విక్రయిస్తే చర్యలు తప్పవన్నారు.