గణతంత్ర దినోత్సవ వేడుకల్లో గవర్నర్ కీలక వ్యాఖ్యలు

గణతంత్ర దినోత్సవ వేడుకల్లో గవర్నర్  కీలక వ్యాఖ్యలు


గణతంత్ర వేడుకల్లో గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై హాట్ కామెంట్స్ చేశారు గవర్నర్ తమిళిసై. నియంతృత్వ ధోరణిని ప్రజలు సహించరని చెప్పారు. నియంతృత్వ విధానాలకు ఓటుతో తీర్పు చెప్పారని వివరించారు. గత పదేళ్లలో పాలకులు రాజ్యాంగ స్పూర్తికి విరుద్దంగా వ్యవహరించారని తెలిపారు.  గత ప్రభుత్వ అసమర్థ విధానాలతో ఆర్థిక స్థితి దిగజారిందని ఆరోపించారు.  తెలంగాణ ఉద్యమంలో కీలకంగా నిలిచిన  యవతకు గత ప్రభుత్వం అన్యాయం చేసిందన్నారు.  నాంపల్లిలోని పబ్లిక్ గార్టెన్స్ లో  జరిగిన రిపబ్లిక్ వేడుకల్లో గవర్నర్ ఈ కామెంట్స్ చేశారు.   

జాతీయ జెండాను అవిష్కరించిన అనంతరం గవర్నర్ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుందని  చెప్పారు.  ప్రజాస్వామ్య స్పృహతో పాలన జరుగుతుందన్నారు.   ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి  ప్రజా ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ..  వంద రోజుల్లో అన్ని గ్యారంటీలను అమలు చేస్తుందని వెల్లడించారు.  TSPSC ని ప్రక్షాళన చేస్తున్నామని..  ఉద్యోగాల విషయంలో యువతకు ఎలాంటి అనుమానాలు అక్కర్లేదన్నారు. 

మరోవైపు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో అమర జవాన్ల స్థూపం దగ్గర నివాళులర్పించారు సీఎం రేవంత్ రెడ్డి. రిపబ్లిక్ డే సందర్భంగా... అమరుల త్యాగాలను గుర్తు చేసుకున్నారు. రాష్ట్ర ప్రజలకు 75 వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు చెప్పారు.