బాపూఘాట్ లో డిజిటల్ మ్యూజియం

బాపూఘాట్ లో డిజిటల్ మ్యూజియం
  •     ప్రారంభించిన గవర్నర్  శివప్రతాప్​ శుక్లా, సీఎం రేవంత్ రెడ్డి 

హైదరాబాద్, వెలుగు: జాతిపిత మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని లంగర్ హౌస్‌‌‌‌లోని బాపూ ఘాట్ వద్ద గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా, సీఎం రేవంత్ రెడ్డి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆధునిక సాంకేతిక హంగులతో తీర్చిదిద్దిన ప్రత్యేక డిజిటల్ మ్యూజియాన్ని గవర్నర్, సీఎం రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం మ్యూజియంలో ఏర్పాటు చేసిన మహాత్మా గాంధీ స్వాతంత్ర్య పోరాటం, చారిత్రక ఘట్టాలు, సత్యాగ్రహ విశేషాల డిజిటల్ ప్రదర్శనలను వారు తిలకించారు. 

యువతకు, భావితరాలకు గాంధేయవాదం, శాంతి సందేశాలను సులువుగా చేరువ చేసేందుకు ఈ డిజిటల్ మ్యూజియం ఎంతగానో ఉపయోగపడుతుందని గవర్నర్, సీఎం అభిప్రాయపడ్డారు. అనంతరం బాపూ ఘాట్ ప్రాంగణంలో నిర్వహించిన సర్వమత ప్రార్థనలు, గాంధీజీకి ఇష్టమైన భజన కార్యక్రమాల్లో వారు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి, పొన్నం ప్రభాకర్, మహ్మద్ అజారుద్దీన్, పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్, ఎంపీ వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు వి. హనుమంత రావు, ప్రభుత్వ విప్‌‌‌‌లు అద్దంకి దయాకర్, రామచంద్రు నాయక్ , పలువురు ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.