రూల్స్కు విరుద్ధంగా పనిచేయమంటే ఎలా?

రూల్స్కు విరుద్ధంగా పనిచేయమంటే ఎలా?

చెన్నై: సీఎం చెప్పినచోట సంతకం చేయడానికి తానేమీ రబ్బర్ స్టాంప్ కాదన్నారు గవర్నర్ తమిళిసై. చెన్నైలో కాఫీ టేబుల్ పుస్తకాలను ఆవిష్కరించిన ఆమె.. కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం కేసీఆర్తో గ్యాప్ ఉన్న మాటే నిజమేనని గవర్నర్ అంగీకరించారు. ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన కొందరు సీఎంలు నియంతలుగా మారేందుకు ప్రయత్నిస్తున్నారని, ఇది మంచిది కాదని తమిళిసై అభిప్రాయపడ్డారు. ఇద్దరు సీఎంలతో కలిసి పనిచేస్తున్నానని.. ఇద్దరూ భిన్నమైనవారంటూ కామెంట్ చేశారు. రూల్స్ కు వ్యతిరేకంగా ఉంది కాబట్టే సర్వీస్ కోటాలో ప్రభుత్వం సిఫారసు చేసిన ఎమ్మెల్సీని తిరస్కరించానని.. తర్వాత మరొకరి పేరు సూచిస్తే ఆమోదించానని చెప్పారు.

రూల్స్ కు వ్యతిరేకంగా పనిచేయమంటే ఎలా? అని ప్రశ్నించారు. ప్రభుత్వం చెప్పినట్లు చెయ్యకపోతే వ్యతిరేకించడం ఏంటని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ బర్త్ డే కు పుష్పగుచ్చం పంపించానని.. ఫోన్ లో మాట్లాడటానికి ప్రయత్నిస్తే అందుబాటులోకి రాలేదని తెలిపారు. ఢిల్లీ వెళ్లగానే తనపై అసత్య ప్రచారం చేశారని మండిపడ్డారు. ఏదైనా అభిప్రాయభేదాలుంటే చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని గవర్నర్ సూచించారు.