రేపు నల్గొండలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించనున్న గవర్నర్

రేపు నల్గొండలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించనున్న  గవర్నర్
  • ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించనున్న గవర్నర్ డా.తమిళి సై సౌందర రాజన్

నల్గొండ: రాష్ట్ర గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ రేపు బుధవారం నల్గొండ జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లా కేంద్రం లో వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు. రేపు హైద్రాబాద్ నుండి ఉదయం 9.50 గంటలకు రోడ్డు మార్గంలో బయలుదేరి 11.15 గంటలకు నల్గొండ జిల్లా కేంద్రం లోని ఆర్ & బి అతిథి గృహానికి చేరుకుంటారు. ఉదయం11.30 గంటలకు ఆర్ & బి అతిథి గృహం నుండి  బయలు దేరి నల్గొండ పట్టణం( షేర్ బంగ్లా)లో  11.35 గంటలకు భక్తాంజనేయ సహిత  సంతోషి మాత దేవాలయాన్ని ప్రారంభిస్తారు. అనంతరం ఆర్ & బి అతిథి గృహం చేరుకుంటారు. మధ్యాహ్నం ఒంటి గంటకు నల్గొండ పట్టణం అర్జాల బావి, ఏ దుప్పల పల్లి లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శిస్తారు. అనంతరం హైదరాబాద్ కు తిరుగి వెళ్లనున్నారు.