అమిత్ షాతో భేటీ కానున్న గవర్నర్ తమిళి సై

అమిత్ షాతో భేటీ కానున్న గవర్నర్ తమిళి సై

గవర్నర్ తమిళిసై ఢిల్లీకి వెళ్లారు. రాష్ట్రంలో ప్రోటోకాల్ ఉల్లంఘనపై సమాచారం సేకరించేందుకు ఢిల్లీకి రావాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గవర్నర్ ను కోరినట్లు తెలిసింది. ఇవాళ అమిత్ షా తో తమిళిసై భేటీ కానున్నట్లు తెలుస్తోంది. సీఎం కేసీఆర్ ఢిల్లీలోనే ఉన్న టైంలోనే గవర్నర్ కు కేంద్రం నుంచి పిలుపు రావటం ప్రాధాన్యత సంతరించుకుంది.

ఇటీవల గవర్నర్ కు ప్రోటోకాల్ కల్పించటంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోంది. ఫిబ్రవరిలో  మేడారం జాతరకు వెళ్లిన గవర్నర్ ను మంత్రులు, కలెక్టర్, ఎస్పీ పట్టించుకోలేదు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లోనూ గవర్నర్ ప్రసంగం లేకుండానే ప్రభుత్వం సమావేశాలను నిర్వహించింది. కేంద్రం ఏర్పాటు చేసిన సంస్కృతీ ఉత్సవాలకు కూడా రాష్ట్ర ప్రభుత్వం దూరంగా ఉంది. రాజ్ భవన్ లో ఏర్పాటు చేసిన ఉగాది వేడుకలకు గవర్నర్ ఆహ్వానించినా.. కేసీఆర్ సహా మంత్రులు ఎవరూ రాలేదు. ఇటీవల యాదాద్రి ఆలయం   ప్రారంభోత్సవానికి  గవర్నర్ ను పిలవకపోవడం కూడా చర్చకు దారితీసింది.   వీటన్నింటిపై ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి కేంద్రం వివరాలు సేకరించింది. ఇవన్నీ రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే చేసిందని కేంద్ర హోంశాఖకు నివేదకలు అందాయి. ఈ క్రమంలోనే అమిత్ షాకు  గవర్నర్ ఇచ్చే నివేదికపై ప్రాధాన్యత సంతరించుకుంది.  అమిత్ షాతో గవర్నర్ భేటీ సందర్భంగా రాష్ట్రంలో ఏమైనా మార్పులు చోటుచేసుకుంటాయా అనేది ఇపుడు ఆసక్తికరంగా మారింది.

దేశం కోసం పని చేసే పార్టీ బీజేపీనే