భీమేశ్వర ఆలయానికి రూ.1 కోటిపైగా ఆదాయం

భీమేశ్వర ఆలయానికి రూ.1 కోటిపైగా ఆదాయం

వేములవాడ, వెలుగు : వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థాన అనుబంధ ఆలయం భీమేశ్వర స్వామి ఆలయంలో శుక్రవారం హుండీ లెక్కింపులో భారీగా ఆదాయం సమకూరింది. 15 రోజుల్లో  రూ. 1 కోటి 8 లక్షల 10 వేల నగదు, 32 గ్రాముల బంగారం, 3.100 కిలోల వెండిని భక్తులు సమర్పించినట్లు ఆలయ అధికారులు తెలిపారు. 

 హుండీ లెక్కింపును ఆలయ ఈఓ రమాదేవి, కరీంనగర్ ఏసీ ఆఫీస్ రాజమౌళి,  ఆలయ ఇన్‌చార్జ్ ఏఆర్ ఇన్‌స్పెక్టర్ సురేష్ , ఏఆర్ సబ్ ఇన్‌స్పెక్టర్ సాయికిరణ్ పర్యవేక్షణలో నిర్వహించారు. అధికారులు, పర్యవేక్షకులు, ఆలయ సిబ్బంది, రాజరాజేశ్వర సేవాసమితి సభ్యులు పాల్గొన్నారు.