రాజ్యాంగ బద్ధమైన పోస్టుకి అధికారులు గౌరవం ఇవ్వాలి

రాజ్యాంగ బద్ధమైన పోస్టుకి అధికారులు గౌరవం ఇవ్వాలి

బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థుల డిమాండ్లు తీర్చదగ్గవేనని గవర్నర్ తమిళి సై అన్నారు.  ట్రిపుల్ ఐటీని సందర్శించిన గవర్నర్ విద్యార్థులతో కలిసి బ్రేక్ ఫాస్ట్ చేశారు. విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు కూడా వారి సమస్యలను గవర్నర్ తో చెప్పుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన గవర్నర్.. విద్యార్థులతో గ్రూప్ లుగా, పర్సనల్ గా మాట్లాడినట్లు చెప్పారు. విద్యార్థుల డిమాండ్లు చాలా సింపుల్ గా ఉన్నాయన్నారు. లైబ్రరిలో సౌకర్యాలు తక్కువగా ఉన్నాయన్నారు.2017 నుంచి విద్యార్థులకు ల్యాప్ ట్యాప్ లు లేవన్నారు. ట్రిపుల్ ఐటీలో  స్పోర్ట్స్ యాక్టివిటీస్ లేవన్నారు.

విద్యార్థులకు మంచి క్వాలిటీ భోజనం అందించాలని గవర్నర్ తమిళి సై అన్నారు. అమ్మాయిలకు భద్రత విషయంలో సమస్య ఉన్నట్లు తెలిసిందన్నారు. సిబ్బంది కొరత కూడా ఉందన్నారు. మెస్ ల విషయంలో పిల్లలు సంతోషంగా లేరని చెప్పారు. ఇవాళ తాను వచ్చానని మంచి బ్రేక్ ఫాస్ట్ పెట్టారన్నారు. ఇవాళ్టి నుంచి ఒక్కో సమస్య తీరుతుందన్న నమ్మకం  ఉందన్నారు . రాష్ట్రంలో గవర్నర్ కి ఇస్తున్న ప్రోటోకాల్ అందరికి తెలుసని సమిళిసై అన్నారు . రాజ్యాంగ బద్ధమైన పోస్టుకి అధికారులు గౌరవం ఇవ్వాలన్నారు.