- ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే జాటోత్ రామచంద్రనాయక్
మరిపెడ, వెలుగు: కొత్తగా ఎన్నికైన సర్పంచ్ లు ఇదే విజయోత్సాహంతో పల్లెల ప్రగతికి పాటుపడాలని ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే జాటోత్ రామచంద్రనాయక్ అన్నారు. గురువారం మరిపెడ మండలం తాళ్ల ఊకల్, వెంకంపాడు, రూప్సింగ్ తండా, చింతలగడ్డ తండా, పాంబండ తండా సర్పంచ్ లు మరిపెడ బంగ్లాలోని క్యాంపు ఆఫీసులో అనుచరులతో కలిసి ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా గెలిచిన సర్పంచ్ లను ఎమ్మెల్యే అభినందించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజలు కాంగ్రెస్ పార్టీని మిమ్ములను విశ్వసించి ఓటేశారని, అందరిని కలుపుకొని వెళ్తూ గ్రామాలను అభివృద్ధి చేసి ప్రజల మన్నాలను పొందాలన్నారు. ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని భవిష్యత్తుకు పునాది వేసుకోవాలన్నారు. కొంపల్లి శ్రీనివాస్ రెడ్డి, పెండ్లి రఘువీరారెడ్డి, సర్పంచ్ లు తప్పెట్ల శ్రీను తదితరులు పాల్గొన్నారు.
